18 నుంచి అసెంబ్లీ సమావేశాలు

374
cm kcr
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండు రోజుల పాటు జరగనున్నాయి. ఈ నెల 18,19 తేదీల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అసెంబ్లీ, మండలి సమావేశాలు కేవలం మున్సిపల్ బిల్లును ఆమోదించేందుకు మాత్రమే ఉద్దేశించినవని, ప్రశ్నోత్తరాలు తదితర అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఉండవని సీఎం కార్యాలయం గురువారం ప్రకటించింది.

18న కొత్త మున్సిపాలిటీ చట్టం బిల్లు ప్రతులను ఎమ్మెల్యేలకు అందించనున్నారు. బిల్లుపై 19న చర్చించి ఆమోదం తెలుపనున్నారు. ఈ నెల 19వ తేదీన మండలి కూడా సమావేశం కానున్నది. రాష్ట్రంలో నూతన మున్సిపల్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాతే మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనున్నారు.

ఇక మున్సిపల్ ఎన్నికలను నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి. ఈ నెల మూడోవారం లేదా నాలుగోవారం ప్రారంభంలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. 129 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి.

- Advertisement -