సీఎం కేసీఆర్ సమక్షంలో నేడు టీఆర్ఎస్ఎల్పీ సమావేశం..

258
kcr trslp
- Advertisement -

రేపు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నేడు టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం జరుగనుంది. తెలంగాణ భవన్ లో ఉదయం 11.30గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగనుంది. టీఆర్ఎస్ ఎల్పీ కార్యక్రమంలో ఎమ్మెల్యేలందరూ హజరుకానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలా ఓటు వెయ్యాలో మీటింగ్ చర్చించనున్నారు. సమావేశం అనంతరం తెలంగాణ భవన్ లోనే మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. తద్వారా అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలో, ఓటు ఎలా వెయ్యాలో పార్టీ నేతలకు స్పష్టం అవుతుంది. ఎందుకంటే చాలా మంది నూతన శాసనసభ్యులు ఉండటంతో ఈ మాక్ పోలింగ్ ను నిర్వహించనున్నారు.

12న ఉదయం జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలంతా పాల్గోనాలని సూచించారు సీఎం కేసీఆర్. మొత్తం 5 స్ధానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగగా టీఆర్ఎస్ నాలుగు స్ధానాల్లో పోటీ చేయగా మిత్రపక్షం ఎంఐఎం కు ఒక స్ధానాన్ని కేటాయించింది. సంఖ్యాబలం ప్రకారం తమకు కూడా ఒక ఎమ్మెల్సీ స్ధానం వస్తుందని చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 4గురు ఎమ్మెల్యేలు ఇటివలే టీఆర్ఎస్ చేరనున్నట్లు ప్రకటించారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నుంచి కాంగ్రెస్ తప్పుకున్నట్లే అనుకోవచ్చు. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీలో ఎవరెవరికి ఎమ్మెల్సీ పదవులు వరిస్తాయో తెలియాలంటే రేపటి వరకూ వేచి చూడాల్సిందే.

- Advertisement -