చేనేత కళకు “మల్లేశం” చిత్రం జీవం పోసిందిః కేటీఆర్

360
Ktr Mallesham Movie
- Advertisement -

చేనేత కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన..‘మల్లేశం’. ఈ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సినిమా ప్రివ్యూను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం వీక్షించారు. హైదరాబాద్ రామా నాయుడు స్టూడియో లో ప్రదర్శించిన ప్రివ్యూ షోను ‘మల్లేశం’ చిత్ర బృందంతో కలిసి కేటీఆర్ వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు కేటీఆర్… ఒక సామాన్యుడి జీవితాన్ని తెరపై ఆవిష్కరించిన విధానం బాగుందని కేటీఆర్‌ ప్రశంసలు కురిపించారు.

మల్లేశం సినిమా ఎంతో హృద్యంగా, మానవీయంగా ఉందని పేర్కొన్నారు. అంతరించిపోతున్న చేనేత కళకు మల్లేశం చిత్రం జీవం పోసిందని మూవీ యూనిట్‌ను అభినందించారు. సినిమాటోగ్రఫీ మంత్రితో మాట్లాడి ఈ సినిమాకు వినోదపు పన్ను రాయితీ వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ సినిమా మాటల రచయిత పెద్దింటి అశోక్‌ కుమార్‌ అజ్ఞాతసూర్యుడు అంటూ ప్రశంసించారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో చేస్తుందన్నారు. నాతో పాటు కొంతమంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరిస్తున్నారని కేటీఆర్ తెలిపారు.

- Advertisement -