సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన

344
ktr siricilla
- Advertisement -

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు తన నియోజకవర్గం సిరిసిల్లలో పర్యటించనున్నారు. ఉదయం 11గంటలకు సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు చేరుకుని పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత బతుకమ్మ చీరలు, మరమగ్గాల పరిశ్రమ అభివృద్ది వర్క్‌టూ ఓనర్ పథకం, అపెరల్ పార్కు తదితర అంశాలపై కెటిఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణభాస్కర్, చేనేత జౌళీశాఖ డైరెక్టర్ శైలజారామయ్యర్, టెస్కో జనరల్ మేనేజర్ యాదగిరితో పాటు పలువురు అధికారులు పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం తిరిగి హైదరాబాద్ కు పయనం కానున్నారు.

- Advertisement -