ఈ ఫలితాల వల్ల టీఆర్ఎస్ కు ఎటువంటి నష్టం ఉండదుః కేటీఆర్

305
ktr
- Advertisement -

పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు బాగా కష్టపడ్డారన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నేడు ఆయన అసెంబ్లీ హాలులో మిడియా మిత్రులతో చిట్ చాట్ నిర్వహించారు. 2014సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మొత్తం 34శాతం ఓట్లతో 11పార్లమెంట్ సీట్లు సాధించామని..అప్పటికంటే ఇప్పుడు 6శాతం ఓట్లు పెరిగినా 9సీట్టే గెలిచామన్నారు. గడిచిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చాలా కష్టపడ్డారని చెప్పారు. కాంగ్రెస్ గెలిచిన మూడు సీట్లలో రెండు సీట్లు కొద్ది తేడాతో గెలిచాయన్నారు. ఈఫలితాల వల్ల టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎటువంటి నష్టం ఉండదని తేల్చి చెప్పారు. మోదీ ప్రధానిగా ఉండటం వల్లే ఆ పార్టీకి ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. బీజేపీకి కార్యకర్తలు లేనిచోట కూడా ఆ పార్టీ గెలిచిందని తెలిపారు.

అదిలాబాద్ సీటు గెలుస్తామని బీజేపీ అస్సలు ఉహించి ఉండదన్నారు. రాహుల్ గాంధీ, దేవెగౌడ లాంటి నేతలే ఓటమిపాలయ్యారని గుర్తుచేశారు. సిరిసిల్లలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధికి 3వేల ఓట్లు పడితే ఈఎన్నికల్లో 50వేల ఓట్లు పడ్డాయని చెప్పారు. ఈఎన్నికల్లో 16 కు 16 పార్లమెంట్ స్ధానాలు గెలిచినా ఎం లాభం ఉండేది కాదన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల్లో మోడీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఏవరి మద్దతు అవసరం లేదన్నారు. టీఆర్ఎస్ ఓటమి చెందిన స్ధానాలపై ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత సమీక్ష చేస్తామని చెప్పారు. ఎంపిటీసీ, జెడ్పిటీసీ ఎన్నికల్లో మెజార్టీ స్ధానాలు సాధిస్తామని తెలిపారు.

హరీష్‌ రావు ను ఈ ఎన్నికల్లో పక్కన పెట్టామనే వార్తల్లో వాస్తవం లేదన్నారు. నిజామాబాద్ లో కవిత ఓటమికి కారణం రైతులు కాదని తెలిపారు.అక్కడ నామినేషన్లు వేసింది రైతులు కాదు రాజకీయ నాయకులే అని చెప్పారు. నిజామాబాద్ లో కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయి కాబట్టే కవిత ఓడిపోయిందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇంకా టీఆర్ఎస్ లో చేరలేదు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరడం వల్లే పార్టీకి నష్టం జరిగిందని వస్తున్న  వార్తల్లో వాస్తవం లేదన్నారు. మంత్రివర్గ విస్తరణపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

- Advertisement -