కేటీఆర్ బయోడేటా

384
KTR

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెండవ సారి మంత్రిగా ప్రమాణ స్వీకారాం చేయనున్నారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు రాజ్ భవన్ లో మంత్రిగా ప్రమాణం చేయనున్నారు.

కేటీఆర్ కుటుంబ నేపథ్యంః
కేటీఆర్ పూర్తి పేరు కల్వకుంట్ల తారకరామారావు. కేటీఆర్ 1976 జులై 24న జన్మించారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, శోభ దంపతులకు కేటీఆర్ జన్మించారు. కేటీఆర్ శైలిమను పెళ్లిచేసుకున్నారు.వారికి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు.

విద్యాభ్యాసంః

కేటీఆర్ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ లో   విద్యను అభ్యసించారు. ఇంటర్మీడియట్ గుంటూరులోని విజ్నాన్ జూనియర్ కాలేజిలో పూర్తి చేశారు. డిగ్రీని ఉస్మానియా యూనివర్సిటిలో బీయస్సీ మైక్రోబయాలజీ చదివారు. ఆ తర్వాత పీజీని పూణెలోని యూనివర్సిటీ ఆఫ్ పూణెలో పూర్తి చేశారు. ఆ తర్వాత అమెకారాలో ఎంబీఏ చేశారు. 1998-99లో అమెరికాలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేశారు.

Ktr New
రాజకీయ జీవితంః

కేటీఆర్ 2006వరకు అమెరికాలో ఉద్యోగం చేసి ఆ తర్వాత ఇండియాకు వచ్చారు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమం జరుగుతుండటంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి తండ్రితో పాటు ఉద్యమంలో పాల్గోన్నారు. 2006సంవత్సరంలో జరిగిన కరీంనగర్ ఉప ఎన్నికల్లో తండ్రి కేసీఆర్ ఎంపీగా పోటీ చేయడంతో ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గోన్నారు. అంతేకాకుండా యూత్ లో మంచి పేరు తెచ్చుకుని యూత్ ఐకాన్ గా నిలిచారు.

ఆ ఎన్నికల్లో కేసీఆర్ 2లక్షల మెజార్టీతో విజయం సాధించారు. అప్పటి నుంచి పార్టీలో చాలా యాక్టివ్ గా పని చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్ధి చేతిలో 171ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ కోరుతూ 2010 జులైలో టీఆర్ఎస్ కు సంబంధించిన 10మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అప్పడు సిరిసిల్లలో మళ్లీ బై ఎలక్షన్లు జరగగా కాంగ్రెస్ అభ్యర్ధిపై 64వేల ఓట్ల మెజార్టీతో విజయం మరసారి విజయం సాధించారు.

ఆ తర్వాత 2011 నుంచి 2014వరకు జరిగిన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. చాలా సార్లు జైలుకు కూడా వెళ్లారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014లో తొలిసారి జరిగిన సాధారణ ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి పోటీ చేసి 53వేల మెజార్టీతో మూడోసారి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 119అసెంబ్లీ స్ధానాలకు గాను 66నియోజకవర్గాల్లో విజయం సాధించింది. జూన్ 2 , 2014లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర తొలి ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఐటీ శాఖ మంత్రిగా ఆయన రాష్ట్రానికి పలు కంపెనీలను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. యంగ్ అండ్ డైనమిక్ యూత్ లీడర్ గా పేరు తెచ్చుకున్నారు. పలు దేశాలకు వెళ్లి ప్రసంగాలు కూడా ఇచ్చారు.

తెలంగాణ లో ఐటీ రంగాన్ని ముందుకు తీసుకురావడంలో ప్రత్యేక చొరవ చూపించారు. మైక్రోసాప్ట్ సీఈవో సత్య నాదెండ్ల, అమెజాన్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. పంచాయితీ రాజ్ మంత్రిగా పలు ఆయన పలు సేవలందించారు. గ్రామాల అభివృద్దే లక్ష్యంగా ఆయన పనిచేశారు. 2015లో జరిగిన జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో కేటీఆర్ కీలక పాత్ర పోషించారు. 100స్ధానాల్లో టీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి తన సత్తాను చాటారు. 119 స్ధానాలకు గాను 89 స్ధానాల్లో టీఆర్ఎస్ అభ్యర్దులు విజయం సాధించి రికార్డు సృష్టించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన రెండవ సారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.