తెలంగాణలో టీఆర్ఎస్‌..ఏపీలో వైసీపీదే హవా

259
kcr trs
- Advertisement -

వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో తెలంగాణలో గులాబీ ప్రభంజనం వీయనుందని రిపబ్లిక్ టీవీ సీ ఓటర్‌ సర్వే స్పష్టం చేసింది. జాతీయ స్ధాయిలో ఎన్డీయేకు ఎదురుగాలి వీయనుందని యూపీఏ మెరుగైన స్ధానాలు దక్కించుకుంటుందని సర్వే తెలిపింది. ఇక తెలంగాణలో 16 స్ధానాల్లో టీఆర్ఎస్ గెలుస్తుందని ఒక స్ధానంలో ఎంఐఎం గెలుస్తుందని స్పష్టం చేసింది. ఇక ఏపీలో వైసీపీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తుందని 19 ఎంపీ స్ధానాల్లో ఆ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని తేల్చిచెప్పింది.

2014 ఎన్నికల్లో సొంతంగా 282 స్థానాలు, ఎన్డీయే కూటమిగా 336 స్థానాల్లో గెలిచి అధికార పగ్గాలు స్వీకరించిన బీజేపీకి ఈ దఫా కష్టాలు తప్పవని తెలిపింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే 233 స్థానాలు గెలుచుకుంటుందని సర్వే తెలిపింది. ఎన్డీయే, యూపీఏ కూటముల్లో ఎవరికీ పూర్తిస్థాయి మెజార్టీ రాదని, బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందన్నది.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, తృణమూల్, డీఎంకే, వైసీపీ వంటి ప్రాంతీయ పార్టీలు చక్రం తిప్పనున్నట్లు పేర్కొంది. తెలంగాణలో టీఆర్‌ఎస్ రికార్డుస్థాయిలో 42.4% ఓట్లు సాధించి అగ్రస్థానంలో ఉంటుందని రిపబ్లిక్ టీవీ-సీ వోటర్ సర్వే పేర్కొంది. ఏపీలో టీడీపీ కేవలం ఆరుస్థానాలకే పరిమితం కానున్నదని పేర్కొంది.

https://twitter.com/KTRTRS/status/1088486027801415680

- Advertisement -