ఫ్లోరిడాలో టీఆర్ఎస్ ప్రచార కార్యాలయం ప్రారంభం

179
trs uk
- Advertisement -

తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఫ్లోరిడాలో టీఆర్ఎస్ ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించారు ఎన్నారై టీఆర్ఎస్. టీఆర్ఎస్‌ మిషన్ కార్యక్రమంలో ఎన్నారై టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్షి మహేష్ బిగాల సూచనలు, సలహాల మేరకు ముందుకు పోతున్నామని తెలిపారు మహేష్‌ తన్నీరు.

టీఆర్‌ఎస్‌ మిషన్.కాం అనే వెబ్ అప్లికేషన్‌లో రిజిష్టర్ చేసుకొని దాని ద్వారా తెలంగాణ అఖండ విజయానికి ప్రచార మాద్యమంగా ఎలా దోహపడాలి అనే ముఖ్యంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి ప్రవాస భారతీయుడు న్యాయబద్ద, ధర్మబద్దమయిన తమతమ మద్దతును ప్రకటించడానికి, ప్రాంతోన్నతికి, దేశాభివృద్దికి పాటుపడే నాయకులను గెలిపించటానికి, జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించారు.

ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎన్నారై సమన్వయకర్త చందు తల్లా, టీఆర్ఎస్ యు.ఎస్.ఈస్ట్ కోస్ట్ ప్రాంతీయ అధికారి టోనీ జాను,టీఆర్ఎస్ యు.ఎస్. ఫ్లోరిడా ప్రాంతీయ అధికారి మోహిత్ కర్పూరం అధ్యక్షతన నమోదు ప్రక్రియ, తెలంగాణను అభివృద్ది పథం వైపు నడిపిన వివిధ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై చర్చించనున్నారు.

- Advertisement -