సైదిరెడ్డి విజయం ఖాయం : కేటీఆర్

993
ktr nalgonda
- Advertisement -

హుజుర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి విజయం ఖాయమని తెలిపారు మంత్రి కేటీఆర్.
నల్గొండ లో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ హుజుర్ నగర్‌ ఉప ఎన్నికల్లో ఈ సారి గెలిచేది టీఆర్ఎస్‌ అని స్పష్టం చేశారు.

హుజుర్‌నగర్ గడ్డపై గులాబీ జెండా ఎగరబోతున్నది…….రాజకీయ చైతన్యం కలిగిన హుజుర్‌నగర్‌ ఓటర్లు విలక్షణ తీర్పు ఇవ్వాలన్నారు.అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ గెలవాలి……కాంగ్రెస్ అరాచకాలకు చరమగీతం పాడాలన్నారు.

పరిపాలన సౌలభ్యం కోసం కొత్త పంచాయతీ లను, కొత్త జిల్లా లను ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్నికల హామీల్లో ఇవ్వని కార్యక్రమాలను కూడా అమలు చేస్తున్నాం……నల్గొండ జిల్లాలో, సూర్యాపేట లో యాదాద్రి లో మూడు మెడికల్ కాలేజ్ లను ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ ది అన్నారు.

యాదాద్రి పవర్ ప్లాంట్ ను నిర్మిస్తున్న ఘనత టీఆర్ఎస్‌ది………మెట్ట ప్రాంతాలకు కూడా సాగు నీరు అందిస్తున్నాం………..ఫ్లోరైడ్ బాధితులు లకు స్వచ్ఛమైన నది జలాలను భగీరథ ద్వారా అందిస్తున్నామని వెల్లడించారు.

హుజుర్‌నగర్‌ ప్రజలు ఆలోచన చేయాలి….కాంగ్రెస్,బీజేపీ పార్టీలు ఎగిరెగిరి పడుతున్నారు…..ప్రజా క్షేత్రంలో వారికి బుద్దిచెప్పాలన్నారు.ఎన్నికల్లో పంచడానికి కారులో డబ్బులు తరలిస్తూ తగల బెట్టిన నీచ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇది అందరికీ తెలుసన్నారు. సైదిరెడ్డి స్థానికుడు… అందరిలో కలిసి పోయాడు……… ఈ సారి సైదిరెడ్డి గెలుపు ఖాయమన్నారు.

హుజుర్‌నగర్ లో టీఆర్ఎస్ గెలుపు ఎప్పుడో ఖాయం……ఉత్తమ్ కు సరైన బుద్ది చెప్పాలన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి.కాంగ్రెస్ ను బొంద పెట్టాలి….ఉత్తమ్ కుయుక్తులు ఇక చెల్లవు…….గత ఎన్నికల్లో కుట్రలు చేసి గెలిచిన ఉత్తమ్‌కు ఈ సారి గుణపాఠం చెప్పాలన్నారు.

- Advertisement -