సౌతాఫ్రికాకు రండి…కేటీఆర్‌కు ఆహ్వానం

284
ktr trs

సౌత్ ఆఫ్రికా దేశాన్ని ఒకసారి సందర్శించాలని మంత్రి కేటీఆర్ ను కోరారు దక్షిణాఫ్రికా టీఆర్ఎస్ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు. సీఎం క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ఎస్ఆర్‌ సౌత్ ఆఫ్రికా విభాగం జనరల్ సెక్రటరీ మెడసాని నరేందర్ రెడ్డితో కలిసి కేటీఆర్‌ని కలిశారు నాగరాజు.

గతేడాది కాలంగా సౌత్ ఆఫ్రికా దేశంలో టీఆర్ఎస్ ఎస్ఆర్ఎ విభాగంలో చేపడుతున్న వివిధ సామాజిక కార్యక్రమాలు, సేవలను కేటీఆర్ కు వివరించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎస్ఆర్ఎ విభాగం చేపట్టిన పనులకు సంబంధించిన మ్యాగజైన్ ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించి, ఎస్ఆర్ఎ విభాగం చేస్తున్న పనులను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్ ఇలాగే మరిన్ని చేపట్టాలని ఆకాంక్షించారు.