కాళేశ్వరంకు టీఆర్ఎస్ సోషల్ మీడియా సోల్జర్స్‌..!

818
trs social media workers
- Advertisement -

ప్రస్తుతం రాజకీయాల్లో సోషల్‌ మీడియా కీలక పాత్ర పోషిస్తుందంటే అతిశయోక్తి కాదు. ఎన్నికల సీజనే కాదు తమ పార్టీ నేతల అభిప్రాయాలను,అభివృద్ధి పనులను బలంగా వినిపించడంలో సక్సెస్ సాధిస్తున్నారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ సైతం సోషల్ మీడియా సోల్జర్స్‌ని సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే.

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్ మీడియాలో ప్రతిపక్షాలపై కౌంటర్ ఎటాక్‌,ప్రభుత్వ పథకాలను క్షేత్రస్ధాయిలోకి తీసుకెళ్లడంలో గులాబీ శ్రేణులు సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు ఈ సోల్జర్స్‌ని కాళేశ్వరం ప్రాజెక్టుపై కౌంటర్‌ ఎటాక్‌కు సోషల్ మీడియానే అస్త్రంగా వాడుకోవాలని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.

ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్,బీజేపీ నుంచి వస్తున్న కామెంట్లను గట్టిగా బదులు ఇచ్చేందుకు సిద్ధమైంది. పార్టీ సోషల్ మీడియా వర్కర్స్‌ను కాళేశ్వరం పర్యటనకు పంపింది టీఆర్ఎస్. వీరంతా అక్కడ ప్రాజెక్టును అధ్యయం చేసి సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై రియాక్ట్ కానున్నారు.

దీంతో పాటు రాష్ట్రంలోని ప్రతి బూత్‌లో పార్టీకి ఒక సోషల్ మీడియా వర్కర్‌ను తయారు చేసేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌. ఇందుకోసం అవసరమైన శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని భావిస్తున్నారు. మొత్తంగా పార్టీ కోసం స్ట్రాంగ్ సోషల్ మీడియా వర్క్‌ టీంను రెడీ చేస్తున్నారు.

- Advertisement -