టీఆర్ఎస్‌లో మున్సి’పోల్’ జోష్

344
ktr
- Advertisement -

తెలంగాణలో మరోసారి ఎన్నికల నగారా మోగనున్న సంగతి తెలిసిందే. త్వరలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుండటంతో అధికార టీఆర్ఎస్ సర్వసన్నద్దమవుతోంది. వరుస ఎన్నికల్లో విజయాలతో జోష్ మీదున్న గులాబీ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా సత్తాచాటేందుకు సిద్ధమవుతోంది.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే వ్యూహాలను సిద్ధం చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అన్ని మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరేలా నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఓ వైపు సభ్యత్వ నమోదు మరోవైపు ఎన్నికలను ఎదుర్కొనేలా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు టీఆర్ఎస్ నేతలు.

మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం 131 మున్సిపాలిటీల కమిషనర్లు, సీడీఎంఏ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. గతంలో గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ తో పాటు పలు కార్పొరేషన్లలో ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించారు. అయితే ఈ సారి ఎన్నికలు బ్యాలెట్ పద్దతిలో జరగనున్నాయి.

ఇక ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్ల జాబితా,వార్డుల విభజన పూర్తి కావడంతో తుది జాబితాను త్వరలో వెల్లడించనున్నారు అధికారులు. 131 మున్సిపాలిటీలు, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం మీద మునిసిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ వ్యూహాలకు పదునుపెడుతుండగా ప్రతిపక్షాలు ఉనికిని చాటుకోవడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -