టీఆర్ఎస్ ఖాతాలోకి మరో రెండు మున్సిపల్ చైర్మన్లు

404
trs
- Advertisement -

మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. ప్రతిపక్షాలకు అందనంత దూరంగా టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్, బీజేపీలు కేవలం సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యాయి. 120మున్సిపాలిటీలకు గాను నిన్న 118స్ధానాల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరిగాయి. దీంట్లో టీఆర్ఎస్ పార్టీ 110స్ధానాలు కైవసం చేసుకుంది. తాజాగా మరో రెండు మన్సిపాలిటీలను కైవసం చేసుకుంది టీఆర్ఎస్. నేరేడుచెర్ల, మేడ్చల్ మున్సిపల్ చైర్మన్ ల ఎన్నిక ఇవాళ్టికి వాయిదా పడిన సంగతి తెలిసిందే.

అయితే నేడు జరిగిన ఈ ఎన్నికల్లో రెండు స్ధానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఇక నేరుడుచెర్ల మున్సిపాలిటిలో కాంగ్రెస్,టీఆర్ ఎస్ కు సమానంగా ఓట్లు రాగా ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ఓటుతో టీఆర్ఎస్ మేయర్ స్ధానాన్ని కైవసం చేసుకుంది. చందమల్లు జయబాబు ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. మరోవైపు మేడ్చల్ మున్సిపల్ చైర్మన్ ను కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దీంతో దీంతో 120స్ధానాలకు గాను 112 మున్సిపల్ చైర్మన్లు టీఆర్ఎస్ గెలిచింది. కాంగ్రెస్ 4, బీజేపీ 2, ఎంఐఎం 2 స్ధానాల్లో విజయం సాధించాయి. 112మున్సిపల్ చైర్మన్లతో పాటు 9 కార్పొరేషన్లను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.

- Advertisement -