సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశం

39
KCR-TRSLP-meeting

త్వరలో జరిగే స్ధానిక సంస్ధల ఎన్నికలకు సన్నద్దం అవుతుంది టీఆర్ఎస్. అందులో భాగంగా నేడు మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం 2.30 గంటలకు పార్టీ శ్రేణులకు టిఆర్‌ఎస్ భవన్‌లో పార్టీ అధ్యక్షుడు, సిఎం కెసిఆర్ దిశా, నిర్ధేశం చేయనున్నారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలుగా పోటీచేసిన అభ్యర్థులు, రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ముఖ్య నాయకులను ఆహ్వానించారు.

రాష్ట్రంలో జరిగే 535 జెడ్పీటీసీ , 5,857 ఎంపీటీసీ ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలపై చర్చించనున్నారు. ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించి నివేదికను జిల్లాల వారీగా కెసిఆర్ తెప్పించుకున్నట్టు తెలిసింది. ముఖ్యంగా వివిధ పార్టీల నుంచి టిఆర్‌ఎస్‌లోకి వలస వచ్చిన నాయకులకు కూడా ఈ ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని దీనిపై ముఖ్యంగా కెసిఆర్ చర్చించనున్నట్టు తెలిసింది. పార్టీ గుర్తుపై ఈఎన్నికలు జరుగుతుండటంతో సీరియస్ గా తీసుకొనున్నారు నేతలు.