పరిషత్ ఎన్నికల్లో చరిత్ర సృష్టించిన టీఆర్ఎస్.. జిల్లాల వ్యాప్తంగా వివరాలు

648
trs
- Advertisement -

ఎంపిటిసి, జెడ్పిటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ చరిత్ర సృష్టించింది. ఇది వరకూ ఎన్నడూ లేని విధంగా మెజార్టీ స్ధానాలు టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈఎన్నికల్లో కాంగ్రెస్ , బీజేపీలు చతికిలపడ్డాయి. టీఆర్ఎస్ అభ్యర్ధులకు కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయాయి. దీంతో గ్రామాల్లో టీఆర్ఎస్ బలం మరింత పెరిగిందని చెప్పుకోవాలి. 32 కు 32 జెడ్పి స్ధానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. తెలంగాణలో గులాబి పార్టీకి ఎదురులేదని మరోసారి నిరూపించారు పల్లె ప్రజలు. ఆరు జిల్లాల్లో (మహబూబ్‌నగర్, కరీంనగర్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, జోగులాంబ గద్వాల) ఒక్క జెడ్‌పిటిసి కూడా ప్రతిపక్షం గెలుచుకోలేకపోయింది. పరిషత్ తీర్పులో టిఆర్‌ఎస్ అగ్రభాగాన నిలవగా కాంగ్రెస్ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక బిజెపి ఉనికి చాటుకోవడంలోనూ ఆపసోపాలు పడింది.

534 జెడ్‌పిటిసి స్థానాలకు ఎన్నికలు జరుగగా, టిఆర్‌ఎస్ పార్టీ 447 స్థానాలు గెలుచుకుని తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకుంది. కాంగ్రెస్ 77 స్థానాల్లో విజయం సాధించింది.అలాగే బిజెపి పార్టీ 8 స్థానాల్లో గెలుపొందగా, ఇతరులు ఐదు చోట్ల విజయం సాధించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 71 జెడ్పిటీసీ స్ధానాలకు టీఆర్ఎస్ 66 విజయం సాధించింది. కాంగ్రెస్ 4 స్ధానాల్లో విజయం సాధించగా, బీజేపీ ఒక స్ధానంలో విజయం సాధించింది. ఇక ఉమ్మడి నల్గోండ జిల్లాలో టీఆర్ఎస్ 57 జెడ్పిటీసీ స్ధానాల్లో విజయం సాధించగా, కాంగ్రెస్ 14స్ధానాల్లో విజయం సాధించింది.

జనగాం జిల్లాలో 12 స్థానాలకు గానూ 12 స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ములుగు జిల్లాలో 8 స్థానాలకు గానూ.. టీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 1 స్థానంలో గెలుపొందారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 11 స్థానాలకు గానూ.. టీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 5, ఇతరులు ఒక స్థానంలో గెలుపొందారు. మంచిర్యాల జిల్లాలో 130 ఎంపీటీసీ స్థానాలకు గానూ.. టీఆర్ఎస్ 83, కాంగ్రెస్ 39, సీపీఐ 1, ఇండిపెండెంట్‌లు 7 స్థానాల్లో గెలుపొందారు.కామారెడ్డి జిల్లాలో మొత్తం 236 ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్ 149, కాంగ్రెస్ 61, బీజేపీ 4, ఇతరులు 22 సీట్లు కైవసం చేసుకున్నాయి. మొత్తం 22 జెడ్పిటీసీ స్థానాల్లో 14 టీఆర్ఎస్, కాంగ్రెస్ 8 సీట్లు గెలిచాయి.

- Advertisement -