వినోద్‌ కుమార్‌ని కలిసిన టీఆర్ఎస్ ఎంపీలు

339
vinod kumar

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా నియమితులయిన కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్‌ని కలిశారు రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పిన నిరంజన్ రెడ్డి… తెలంగాణ అవసరాల మీద విశేష అనుభవం ఉన్న వినోద్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష్య పదవికి న్యాయం చేస్తారని అకాంక్షించారు.

ఇక టీఆర్ఎస్ ఎంపీలు సైతం వినోద్ కుమార్‌ని కలిసి విషెస్ చెప్పారు. వినోద్‌ని కలిసిన వారిలో టీఆర్ ఎస్ లోక్ సభాపక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేష్ నేత ఉన్నారు.

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా నియమితులైన బి వినోద్ కుమార్‌కి టీఆర్ఎస్ ఎంపీల తరపున వారు శుభాకాంక్షలు తెలిపి, శాలువ కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ మాట్లాడుతూ లోక్ సభలో గతంలో తాము లేవనెత్తిన ఆంశాలను ప్రస్తుత లోక్ సభలో టీఆర్ ఎస్ లోక్ సభా పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు నేతృత్వంలో టీఆర్ ఎస్ ఎంపీలు వాటిని కొనసాగిస్తున్నారని ని ప్రశంసించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో, నామా నేతృత్వంలో టీఆర్ ఎస్ ఎంపీలు సమన్వయంతో సభలో నిబద్ధతతో పని చేశారాని తెలిపారు. లోక్ సభలో టీఆర్ ఎస్ ఎంపీలు తెలంగాణ రాష్ట్ర సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, విభజన చట్టం హామీలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారాని చెప్పారు.