టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌ల కోసం ప్రజాప్రతినిధుల విరాళం..

92
KTR

సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 29 జిల్లాల్లో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాలను పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల్లో మంత్రు లు, జెడ్పీ చైర్మన్లు, చైర్‌పర్సన్లు, పార్టీ ముఖ్యనేతలు, పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే జిల్లాలోని పార్టీ ఆఫీస్‌ల నిర్మాణం కోసం పలువురు టీఆర్ఎస్‌ పార్టీ నేతలు విరాళాలను అందజేశారు.

KTR

టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల నుంచి విరాళాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు బేగంపేట ప్రగతిభవన్‌లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని కలిసి పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ జిల్లా కార్యాలయల నిర్మాణం కోసం ఉపయోగించాలని రెండున్నర లక్షల చొప్పున విరాళాలు అందించారు.

KTR

ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఎమ్మెల్సీ మరియు మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు మరియు ఎమ్మెల్యే బాల్క సుమన్‌లు ఈ మేరకు చెక్కులను కేటీఆర్‌కు అందించారు. పలు జిల్లాలో పార్టీ కార్యయాలయ నిర్మాణం కోసం పార్టీ ప్రజా ప్రతినిధులు విరాళాలు ఇవ్వడం పట్ల కేటీఆర్ వారిని అభినందించారు.

KTR