కేటీఆర్‌,హరీష్‌లకు మాజీ ఎంపీ కవిత ఘనస్వాగతం

366
ktr harish

సామాజిక సమతూకం,రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు, వర్గాలకు ప్రాతినిధ్యం దక్కేలా మంత్రివర్గ విస్తరణ చేపట్టారు సీఎం కేసీఆర్. ఉమ్మడి పది జిల్లాలకూ చోటు కల్పించడంతోపాటు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఓసీలకు ప్రాతినిధ్యం లభించేలా చూశారు.

Kavitha-KTR

ఇందులో భాగంగా సీనియర్‌ నేతలైన కేటీఆర్‌,హరీష్‌లతో పాటు సబితా ఇంద్రారెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి తొలిసారిగా ప్రగతిభవన్‌కు విచ్చేసిన కేటీఆర్,హరీష్‌,సబితారెడ్డిలకు సీఎం కుటుంబసభ్యులు ఘనస్వాగతం పలికారు. మాజీ ఎంపీ కవిత స్వయంగా వీరికి కుంకుమ తిలకం దిద్ది శుభాకాంక్షలు చెప్పారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

TS-Ministers1