మణుగూరులో టీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు..

233
trs

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో టీఆర్ఎస్ క్యాంప్ ఆఫీస్ వద్ద కార్యకర్తల పెద్ద ఎత్తున్న సంబురాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే రేగా కాంతారావుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వ విప్‌గా క్యాబినెట్ హోదా కల్పించినందుకు టిఆర్ఎస్ శ్రేణులు బాణా సంచా కాల్చిన సంబరాలు జరుపుకున్నారు.

trs

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఆయన అభిమానులు పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా బాణాసంచా కాల్చి సీఎం కేసీఆర్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఈనేపథ్యంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

MLA Rega Kantha Rao