హస్తినకు చేరిన బిగ్ బాస్ పంచాయితీ..

391
big boss 3
- Advertisement -

మరో రెండు రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభం కానుండగా షోపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్‌ని నిలిపివేయాలంటూ శ్వేతారెడ్డి,గాయత్రి గుప్తా హైకోర్టును ఆశ్రయించగా దర్శక,నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

తాజాగా బిగ్‌ బాస్‌ని నిలిపివేయాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టారు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్తా. బిగ్ బాస్ లో కాస్టింగ్ కౌచ్ ఉందని శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్తా ఆ షో నుంచి బయటికొచ్చారు.బిగ్ బాస్ పేరుతో అశ్లీలతను ప్రోత్సహిస్తున్నారని ఈ సందర్భంగా వారు మండిపడ్డారు. బిగ్ బాస్ లో జరుగుతోన్న విషయాలను సినీ హీరో నాగార్జున తెలుసుకోవాలన్నారు.

సెలక్షన్ ప్రాసెస్ లో అన్యాయం జరుగుతోంది…దీనిపై న్యాయపోరాటం చేస్తున్నామని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. సెక్స్‌వల్ హరాష్‌మెంట్,చీటింగ్‌ జరుగుతోందని అందుకే న్యాయస్ధానాన్ని ఆశ్రయించామని చెప్పారు.

బిగ్ బాస్ ముసుగులో మహిళలు, ఆడ పిల్లలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని గాయత్రి గుప్తా తెలిపారు.బిగ్ బాస్ సెలక్షన్ లో ఒక ప్రొడ్యూసర్ అసభ్యకరంగా మాట్లాడారు..కంపెనీలపై ఉన్న నమ్మకంతో అగ్రిమెంట్ కాఫీలను తీసుకోలేదన్నారు.నాగార్జున మాకు జరిగిన అన్యాయం పై స్పందించాలన్నారు.

దేశ వ్యాప్తంగా బిగ్ బాస్ ను బ్యాన్ చేయాలన్నదే మా డిమాండ్…బిగ్ బాస్ రియాల్టీ షోలో జరుగుతున్న లైంగిక వేధింపులపై దేశ వ్యాప్తంగా అందిరి సహకారం కోరుతున్నామని బిగ్ బాస్ బాధితురాలు శ్వేతా రెడ్డి తెలిపారు.

- Advertisement -