సెట్స్‌పైకి ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ..

184
Trivikram -Jr NTR film start from March
- Advertisement -

ఎన్టీఆర్‌..త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. హీరిక,హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై కుటుంబ కథా చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మార్చిలో మొదలుకాబోతున్నట్లు చిత్రవర్గాలు వెల్లడించాయి.

ఇందులో తారక్‌ మరోసారి కొత్త లుక్‌తో కన్పించబోతున్నారు. ఎన్టీఆర్‌ని కొత్త గెటప్‌లో చూపించేందుకు చిత్రబృందం ప్రముఖ హాలీవుడ్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌ వాన్స్‌ హార్ట్‌వెల్‌ను ఎంపికచేసుకుంది. ఎన్టీఆర్ చివ‌రిగా జై ల‌వ‌కుశ చిత్రంతో ప్రేక్షకుల‌ని ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ ద‌గ్గర భారీ విజ‌యాన్ని అందుకుంది.

సాహో చిత్రంలో ప్రభాస్ సరస‌న క‌థానాయిక‌గా న‌టిస్తున్న శ్రద్ధా క‌పూర్, ఎన్టీఆర్ సరసన జత‌క‌ట్టనుంద‌నే టాక్ న‌డుస్తుంది. అనిరుధ్ ర‌విచంద్రన్ చిత్రానికి సంగీతం అందించ‌నున్నాడు. భారీ బ‌డ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాలోని నటీనటుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ‘టెంపర్‌’లో సిక్స్‌ప్యాక్‌తో, ‘జైలవకుశ’లో త్రిపాత్రాభినయంతో ఆకట్టుకున్న తారక్‌ ఇప్పుడు ఎలాంటి గెటప్‌లో సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -