త్రిషకు వార్నింగ్ ఇచ్చిన నిర్మాతల మండలి

179
Trisha

ప్రముఖ హీరోయిన్ త్రిషకు హెచ్చరికలు జారీ చేసింది నిర్మాతల మండలి. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గోనడం లేదని త్రిషపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రిష ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం ‘పరమపదం విళైయాట్టు’ . తిరుజ్ఞానం తెరకెక్కించిన ఈచిత్రం 28న విడుదల కానుండగా, నిన్న చెన్నైలోని సత్యం థియేటర్ లో యూనిట్ ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది.

అయితే ఈ కార్యక్రమానికి చిత్రయూనిట్ అందరూ హాజరయ్యారు కానీ త్రిష రాకపోవడంపై కొంత మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గోనాలని లేదంటే తీసుకున్న పారితోషకం సగం తిరిగి ఇచ్చేయాలని లేకుంటే తమిళ చిత్రాల్లో నటించకుండా నిషేధం విధిస్తామని హెచ్చరించారు.