‘గాలి’ వారి పెళ్లికి హాజరైతే కోటి రూపాయలు..!

251
Top Heros Attend For Gali's Daughter Wedding
- Advertisement -

కర్ణాటకకు చెందిన గాలి జనార్ధన్ రెడ్డి కుమార్తె బ్రహ్మణి వివాహాం త్వరలోనే జరగనుంది. ఇందుకోసం భారీఎత్తున ఏర్పాట్లుచేస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ విక్రమ్ దేవారెడ్డి తనయుడు రాజీవ్ రెడ్డితో నవంబర్‌ 16 వీరి వివాహం అంగరంగవైభవంగా జరగనుంది. బెంగళూరులోని మెయిన్‌ ప్యాలెస్‌ మైదానం ఇందుకు వేదిక కానుంది.

ఇటీవలె వీరి నిశ్చితార్ధం బెంగళూరులో ఘనంగా జరిగింది. ఇక పెళ్ళి పిలుపు కోసం తయారు చేసిన శుభలేఖతో గాలి జనార్ధన్ రెడ్డి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. సోషల్ మీడియాలో గాలి వారి వివాహపత్రికపై తీవ్రచర్చజరిగింది. దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వివాహా వేడుకకు హాజరుకానున్నారు. తన కుమార్తె వివాహానికి రావాలంటూ పలువురు ప్రముఖులకు గాలి స్వయంగా శుభలేఖలు అందజేశారు. ఇందులో బాలీవుడ్‌, టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖ హీరోలు కూడా ఉన్నారు.

Top Heros Attend For Gali's Daughter Wedding

తెలుగు అగ్రహీరోలు మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దేశ విదేశాల నుంచీ అతిథులు, ఎవరి సంప్రదాయానికి తగినట్లు వారికి వంటలు,ఇంతకు ముందు ఏ ముఖ్యమంత్రి, మంత్రి, పారిశ్రామికవేత్త చేయనంత ఘనంగా పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఇందుకోసం ఏకంగా రూ.550 కోట్లకుపైనే ఖర్చుచేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఇక పెళ్లికి వచ్చే అతిథులకు తన రేంజ్‌కు తగ్గట్టుగానే బహుమతులు ఇవ్వనున్నారట గాలి. వీఐపీలు,హీరోల రేంజ్‌ను బట్టికి వారికి దాదాపుగా కోటిరూపాయల వరకు జనార్థన్ రెడ్డి గిఫ్ట్‌గా ఇస్తున్నరాన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరందుకుంది. ఇక చిన్న హీరోలు,అతిథులకు సైతం వారి స్థాయికి తగ్గట్టుగా బహుమతులు ముట్టచెబుతారన్న వార్త హల్ చల్ చేస్తోంది. ఇక పెళ్లిలో ఏర్పాటుచేసే ప్రతి కార్యక్రమానికి ఫ్యాన్సీరేటును ముట్టచెప్పేందుకు గాలి ఫ్యామిలీ సిద్ధమైందట.

Top Heros Attend For Gali's Daughter Wedding

అయితే, దేశంలోనే నల్లధనాన్ని అరికట్టేందుకు రూ.500,రూ.1000 నోట్లను ప్రభుత్వం నిషేధించడంతో గాలి ఫ్యామిలీ సందిగ్దంలో పడిందట. అనుకున్న ప్రకారం అతిథులకు బహుమతిగా కొత్తనోట్లను ఇచ్చేందుకు గాలి తనదైన శైలీలో ముమ్మరప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేగాదు పెళ్లికి వచ్చే వాళ్ల కోసం ప్రత్యేకంగా రైళ్లను కూడా వేస్తున్నట్లు తెలిసింది. మొత్తంగా ఈ వార్త నిజమైతే…గాలి వారింట పెళ్లికి హాజరయ్యే అతిథులకు పండగే పండగ.

అక్రమ మైనింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గాలి జనార్ధన్‌రెడ్డి బెయిల్‌పై బయటికొచ్చిన సంగతి తెలిసిందే. కొద్దిరోజులుగా కేసు ఒత్తిళ్లకు దూరంగా ఉన్న గాలి తన ఇంటి జరిగే వివాహ విషయంలో బిజీ బిజీగా గడుపుతున్నారు.

Top Heros Attend For Gali's Daughter Wedding

- Advertisement -