ఎన్టీఆర్ వద్దు బన్నీ ముద్దు అంటున్న సీనియర్ హీరోయిన్

43
Tabu

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటివలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈచిత్రం ఈనెల 24నుంచి రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈమూవీలో హీరోయిన్ గా పూజా హెగ్డెను తీసుకున్నారు. మరో ముఖ్యమైన పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ ను తీసుకున్నారట. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు కొన్నేళ్లుగా తెలుగు తెరకు దూరమైన సంగతి తెలిసిందే.

trivikram Tabu

అయితే ఆమె మళ్లీ తెలుగు సినిమాల్లో నటించేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గత రెండు సినిమాలకు టబుని సంప్రదించాడట అయితే ఆమె సౌత్ లో నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదని సమాచారం. రీసెంట్ బన్నీ సినిమా కోసం మరోసారి టబుని సంప్రదించారట త్రివిక్రమ్. ఈసారి మాత్రం త్రివిక్రమ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది టబు.

ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ మూవీకి కూడా టబును నటించమని అడిగాడట త్రివిక్రమ్ కానీ ఆమెకు నచ్చకపోవడంతో సున్నితంగా తిరస్కరించిదంట. దీంతో ఈసారి ఎలాగైనా అమెను ఒప్పించాలని ఫిక్సయ్యాడు త్రివిక్రమ్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు.