బ్రహ్మనందం పొలిటికల్ ఎంట్రీ…ప్రచారం లో బిజీ బిజీ

322
Brahmanandam

సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది స్టార్లు రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఒక్క తెలుగు ఇండస్ట్రీ నుంచే కాకుండా ఇతర భాషల్లో నుంచి కూడా చాలా మంది స్టార్ హీరోలు, కమెడియన్లు, హీరోయిన్లు రాజకీయాల్లో స్ధిరపడ్డారు. కొంత మంది అయితే రెండింటిలో బిజీగా ఉన్నారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ కు చెందిన అగ్ర కమెడీయన్ బ్రహ్మనందం కూడా రాజకీయాల వైపు చూస్తున్నారని తెలుస్తుంది. ఇటివలే ఆయన కర్ణాటకలో ప్రచారం చేయడంతో ఈ ఉహగాహనాలు వినిపిస్తున్నాయి. త్వరలో కర్ణాటకలోని 15నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగనున్నాయి. డిసెంబరు 5వ తేదీన నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రకటించింది.

దీంతో ఎన్నికలకు మరో మూడు రోజుల సమయమే ఉండటంతో… పార్టీలు ప్రచారాన్ని జోరు పెంచాయి. ఈ సందర్భంగా బీజేపీ టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందంను రంగంలోకి దించింది. తాజాగా బ్రహ్మి ఎన్నికల ప్రచారంలో పాల్గోన్నాడు. కర్ణాటకలోని చిక్కబళ్లాపురంలో బీజేపీ అభ్యర్ధికి మద్దతుగా బ్రహ్మనందం రోడ్ షో నిర్వహించారు. ఇక బ్రహ్మనందంను చూడడానికి పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. బీజేపీ అభ్యర్థి సుధాకర్‌కు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

సుధాకర్ రెడ్డి తనకు మంచి మిత్రుడన్నారు. కొన్ని సినిమా డైలాగ్స్ తో అభిమానులను అలరించారు. ఇదిలా ఉండగా బ్రహ్మనందం త్వరలోనే బిజేపీలో చేరనున్నాడని వార్తలు వస్తున్నాయి. అందుకోసమే బ్రహ్మనందం కర్ణాటకలో ప్రచారం చేస్తున్నాడని సమాచారం. ప్రస్తుతం బ్రహ్మనందంకు అవకాశాలు కూడా ఎక్కువ రాకపోవడంతో ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.