సాహో టీజర్…టాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు

150
sahoo

యంగ్ రెబల్ స్టార్ బాహుబలి తర్వాత నటించిన చిత్రం సాహో. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈమూవీని రన్ రాజా రన్ మూవీ దర్శకుడు సుజీత్ తెరకెక్కించారు. యూవీ క్రియేషన్స్ సంస్ధ వారు ఈచిత్రాన్ని నిర్మించారు. ప్రభాస్ సరసన హీరోయిన్ శ్రద్దా కపూర్ నటించారు. కాగా కొద్ది సేపటి క్రితమే ఈచిత్ర టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్ . ఈ టీజర్ కు భారీ స్పందన వస్తోంది.

ప్రభాస్ అభిమానులతో పాటు టాలీవుడ్ సెలబ్రెటీలు కూడా ట్వీట్టర్ లో సాహో టీజర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. హాలీవుడ్ రేంజ్‌లో రూపొందుతున్న ఈ చిత్ర టీజర్‌పై సుధీర్ బాబు, నితిన్, సురేంద‌ర్ రెడ్డి, సాయి ధ‌ర‌మ్ తేజ్, మారుతి, సుధీర్ వ‌ర్మ‌, బెల్లంకొండ శ్రీనివాస్ , పూరీ జ‌గ‌న్ త‌దిత‌రులు చిత్ర టీజ‌ర్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. ప్ర‌భాస్ తెలుగు చిత్ర సీమ‌ని ఎక్క‌డికో తీసుకెళ‌తున్నాడ‌ని అంటున్నారు.ఆగ‌స్ట్ 15న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు.