ట్రంప్‌తో మోడీ భేటీ..కశ్మీర్‌పై చర్చ

574
modi trump
- Advertisement -

ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయ్యారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. దాదాపు 45 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో కశ్మీర్‌ అంశంపై చర్చ జరిగింది.

కశ్మీర్ అంశం భారత్, పాక్ దేశాలకు సంబంధించిన సమస్యేనని స్పష్టం చేశారు మోడీ. కశ్మీర్ సమస్య విషయంలో మిగతా దేశాలను నొప్పించాలని తాము కోరుకోవడం లేదన్నారు. 1947కు ముందు భారత్, పాకిస్థాన్ కలిసి ఉండేవి….. సమస్యలను ఇరు దేశాలు పరిష్కరించుకుంటాయనే నమ్మకం నాకుందని చెప్పారు.

తామిద్దరం కశ్మీర్ అంశాన్ని చర్చించామని ట్రంప్ తెలిపారు. కశ్మీర్ పరిస్థితి నియంత్రణలోనే ఉందని మోడీ చెప్పారని… ఈ సమస్యను ఇరు దేశాలు పరిష్కరించుకుంటాయనే నమ్మకంతో ఉన్నానని ట్రంప్ తెలిపారు.

- Advertisement -