నేడు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

53
cmkcr

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నేడు ప్రగతి భవన్ లో పార్లెమెంటరీ పార్టీ సమావేశం జరుగునుంది. ప్రగతి భవన్ మధ్యాహ్నం 2గంటలకు ఈసమావేశం ప్రారంభంకానుంది. ఇక ఈనెల 17నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈసందర్భంగా పార్లమెంట్ లో అనుసరించాల్సి న వ్వూహాలపై ఎంపీలతో చర్చించనున్నారు సీఎం కేసీఆర్. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారిగా జరుగుతున్న ఈ సమావేశంలో పార్టీ లోక్‌సభాపక్ష నేతపైనా నిర్ణయం తీసుకునే అవకాశమున్నది.

రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలు, విడుదల కావాల్సిన నిధులు, విభజన చట్టంలోని అంశాల అమలులో కేంద్రంపై ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలనే దానిపై చర్చించనున్నారు. సమావేశానికి హాజరుకావాల్సిందిగా పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు సమాచారం అందింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి 9 మంది గెలువగా.. ఆరుగురు రాజ్యసభ సభ్యులు కలిపి మొత్తం 15 మంది ఎంపీలు సమావేశానికి హాజరుకానున్నారు.