వరల్డ్ కప్ ఇండియా టీం ప్రకటన నేడే..

101
India Team

మరికొద్ది రోజుల్లో జరిగే వరల్డ్ కప్ మ్యాచ్ కు నేడు ముంబైలో 15మందితో కూడిన జట్టును ఇవాళ ప్రకటించనుంది బీసీసీఐ. వరల్డ్ కప్ కోసం క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని భారత సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ.. ఈరోజు ముంబైలో సమావేశమై టీమిండియాను ఎంపిక చేయనుంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో పాటు కోచ్‌ రవిశాస్త్రి కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశాలున్నాయి. ఐతే ఐపీఎల్‌కు ముందే ప్రపంచకప్ జట్టును దాదాపు ఖరారు చేశారు.

కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్ర్తి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు ఎంపికలో తమ అభిప్రాయాలు తెలిపారు. జట్టులో నాలుగో స్థానం, మూడో ఓపెనర్, రెండో వికెట్ కీపర్, నాలుగో సీమర్‌పై ఎక్కువగా దృష్టి సారించారు. ముఖ్యంగా నాలుగో స్థానంలో ఎవరిని దింపాలనే అంశంపై చాలా కాలం నిర్ణయం తీసుకోలేకపోయారు.

ఇక థర్డ్ ఓపెనర్ గా ప్రధానంగా ముగ్గురి పేర్లు వినబడుతున్నాయి. యువ ఆటగాడు కేఎల్. రాహుల్, వికెట్ కీపర్ దినేష్ కార్తీక్‌ను, అలాగే హైదరాబాద్ ప్లేయర్ అంబటి రాయుడు పేర్లను పరిశీలిస్తున్నారు. ఐపిఎల్ లో ప్రదర్శను చూసి మూడో ఓపెనర్ ను ఎంపీక చేయనున్నారు. మరికొన్ని గంటల్లోనే వరల్డ్ కప్ ఇండియా టీం ప్రకటించనున్నారు.