నేటి నుంచి…. టీన్యూస్ ఎడ్యుకేషన్ ఫెయిర్

379
tnews education fair
- Advertisement -

ఇంటర్ పూర్తిచేసుకుని.. ఇంజినీరింగ్‌లో చేరుదామనుకునే విద్యార్థులకు బోలెడు సందేహాలు. ఏ కాలేజీలో సీటు వస్తుంది..? ఏ కాలేజీలో చేరితే మంచిది..? ఫీజు వివరాలు.. ప్లేస్‌మెంట్స్ ఉంటాయా..? ఇలా ఎన్నో ప్రశ్నలు విద్యార్థుల మెదళ్లను తొలుస్తుంటాయి. తక్కువ వ్యవధిలో కాలేజీలన్నింటిని తిరిగి.. సమాచారాన్ని సేకరించడం కుదరదు. అందుకే విద్యార్థులకు తిప్పలను తప్పించేందుకు టీ న్యూస్-అపెక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్‌లు సంయుక్తంగా నిర్వహిస్తున్న తెలంగాణ గొల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2019 మళ్లీ వచ్చేసింది‌.

నేటి మూడు రోజుల పాటు నిజాం కాలేజీ గ్రౌండ్స్ ఎడ్యుకేషన్ ఫెయిర్ జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరిగే ఈ ఫెయిర్‌లో కెరీర్ గైడెన్స్‌ తో పాటు బహుమతులు గెలుచుకోండి.

ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్‌ విద్యార్థుల బంగారు భవితకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంటర్ తర్వాత సాంప్రదాయక డిగ్రీ కోర్సులు చేయాలా…లేకుంటే ఇంజనీరింగ్, మెడిసన్‌ కోర్సుల కోసం ఎమ్‌సెట్ కోచింగ్‌లకు వెళ్లాలా అన్న ప్రశ్న ఎదురువుతుంది. అయితే ఈ రెండే కాదు..ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ టు ఎకనామిక్స్… ఏరోనాటిక్స్ టు టెక్స్‌టైల్స్.. ఫిజియోథెరపీ నుంచి ఫ్యాషన్ అండ్ డిజైన్… అగ్రికల్చర్ టు లా- ఇలా ఎన్నో కోర్సులు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్ దశలో విద్యార్థి సెలక్ట్ చేసుకునే కోర్సు. అతని బంగారు యావత్ భవిష్యత్‌ను నిర్దేశిస్తుంది.

ఇప్పటివరకు టీ న్యూస్ నిర్వహిస్తున్న ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో వేల సంఖ్యలో విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. వివిధ కాలేజీల సమాచారాన్ని తెలుసుకున్నారు.  హైదరాబాద్‌లోనే కాకుండా వరంగల్‌లో నిర్వహించిన ఎడ్యుకేషన్ ఫెయిర్‌కు సైతం మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా పట్టణ ప్రాంత విద్యార్ధులతో పాటు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ అందించేందుకు బాగా ఉపయోగపడింది.

ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో ఎన్నో విద్యాసంస్థలు తమ కాలేజీల సమాచారం అందించనున్నాయి. పెద్ద ఎత్తున విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యే ఈ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ కు ప్రవేశం ఉచితం. ఈ ఎడ్యుకేషనల్ ఫెయిర్‌లో ప్రధానంగా ఇంజనీరింగ్, మెడిసిన్‌తో పాటు ఇతర అన్ని కోర్సులు, కెరీర్స్‌ పై విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు ఆయా రంగాలకు చెందిన అత్యంత నిష్ణాతులు విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ అందిస్తారు.

ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ఏ కాలేజీలో,ఏ బ్రాంచిలో సీటు వస్తుందో విద్యార్థులు మాక్ కౌన్సెలింగ్ ద్వారా అంచనాకు రావచ్చు. విద్యార్థులకు ఇంజనీరింగ్ కాలేజీ, బ్రాంచ్ ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వివిధ బ్రాంచ్‌లతో కెరీర్ స్కోప్‌, ఉన్నత విద్యావకాశాలు, పరిశ్రమలు కోరుకుంటున్న నైపుణ్యాల గురించి విద్యారంగ నిపుణులు అవగాహన కల్పించనున్నారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసి సలహాలు సూచనలు ఇస్తారు. కాబట్టి మూడు రోజుల పాటు జరిగే ఎడ్యుకేషనల్ ఫెయిర్‌కు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సహా పెద్ద సంఖ్యలో హాజరై తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరుకుంటోంది greattelangaana.com

ఈ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌కు వెబ్ మీడియా పార్ట్‌నర్ గ్రేట్ తెలంగాణ.కామ్, greattelangana tv (gt tv), ప్రింట్ మీడియా పార్ట్ నర్ నమస్తే తెలంగాణ, మన తెలంగాణ.

- Advertisement -