ప్రజలంతా ఐక్యమత్యంతో ఉండాలి: మోడీ

236
modi

అయోధ్యపై సుప్రీం తీర్పు ఒకరి గెలుపు..మరొకరి ఓటమిగా చూడకూడదన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. సుప్రీం తీర్పు అనంతరం స్పందించిన మోడీ..రామభక్తి,రహీం భక్తికాదు…భారత భక్తిభవాన్ని బలోపేతం చేయాల్సిన సమయం ఇదన్నారు.

ఒక వివాదాస్పదమైన ప్రక్రియను పూర్తి చేయడానికి న్యాయ ప్రక్రియ చాలా అవసరమని ఈ కేసు తీర్పుతో వెల్లడైందన్నారు. దేశ ప్రజలందరూ శాంతి, సద్భావన, ఐకమత్యంతో నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఇరు వర్గాల వాదనలు వినేందుకు కోర్టు చాలినంత సమయాన్ని, అవకాశాన్ని ఇచ్చింది. దశాబ్దాలుగా కొనసాగుతన్న వివాదాన్ని కోర్టు స్నేహపూర్వకంగా పరిష్కరించింది అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

వివాదాస్పద అయోధ్య స్థలంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు. ఇది అందరికీ ఆమోదయోగ్యమైన తీర్పు అని… అందరూ ఐక్యంగా ఉండి రామ మందిర నిర్మాణం చేపట్టాలన్నారు.