ఎమ్మెల్యేలు కూడా నన్ను పిలిపించుకుంటారుః ఉప్పల్ బాలు

1161
uppal Balu pic
- Advertisement -

సోషల్ మిడియా ద్వారా ఎంతో మంది ఓవర్ నైట్ స్టార్ లు అయిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే టిక్ టాక్ అనే యాప్ ద్వారా ఫేమస్ అయ్యాడు ఉప్పల్ బాలు. ఈయనకు టిక్ టాక్ లో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. అంతేకాకుండా ఇతను పెట్టే వీడియోలను చూసి చాలా మంది లైక్ లు, కామెంట్లు పెడుతుంటారు. ఉప్పల్ బాలు ఎంత ఫేమస్ అయ్యాడంటే యూట్యబ్ ఛానళ్లు ఆయన కోసం క్యూ కడుతున్నారు.

తాజాగా ఆయన గ్రేట్ తెలంగాణ టీవి ఇచ్చిన ఇంటర్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను సెలబ్రెటి కాకముందు కొన్ని ఫంక్షన్ లలో డ్యాన్స్ లు చేస్తుండేవాడినని తెలిపారు. నా డ్యాన్స్ చూసి కొంత మంది ఎమ్మెల్యేలు కూడా మెచ్చుకున్నారని చెప్పాడు. మరి కొంతమంది నా డ్యాన్స్ నచ్చి నాతో స్పెషల్ డ్యాన్స్ లు చేయించేవారన్నారు. డ్యాన్స్ చాలా బాగా చేస్తున్నానని చెప్పి నాపై డబ్బులు చల్లే వారన్నారు. ఇక తన తల్లితండ్రుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఉప్పల్ బాలు. తన తల్లి అంటే తనకు చాలా ఇష్టం అని..కానీ మా నాన్న మాత్రం నన్ను ఎప్పుడూ తిడుటుంటారని చెప్పారు.

Uppal Balu Full Interview…

- Advertisement -