తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఉన్న ఆ ముగ్గురు వీరేనా..?

432
BJP
- Advertisement -

గత సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఘోరంగా ఓటమిపాలయిన విషయం తెలిసిందే. కేవలం ఆ పార్టీ నుంచి ఒకే ఒక ఎమ్మెల్యే విజయం సాధించారు. సీనియర్ నేతలు కూడా ఓటమి పాలవ్వడంతో ఆ పార్టీ నేతలు ఢిలాపడిపోయారు. అయితే ఇటివలే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా బీజేపీ 4స్ధానాల్లో విజయం సాధించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక 3శాతం ఉన్న ఓటింగ్ పర్సెంట్ ఏకంగా ఎంపీ ఎన్నికల్లో 20శాతానికి పెరిగింది.

దీంతో బీజేపీ నేతలు కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది. అధిష్టానం పెద్దలు కూడా తెలంగాణపై ప్రత్యేక దృష్టి సాధించారు. కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్తులుగా ఉన్న నేతలను బీజేపీలో చేర్చుకుంటున్నారు. అయితే 2014 ఎన్నికల తర్వాత నుంచి ఆ పార్టీ అధ్యక్షుడిగా ముషిరాబాద్ మాజీ ఎమ్మెల్యే లక్ష్మణ్ కొనసాగుతున్నారు. త్వరలోనే తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడిని మారుస్తారని ప్రచారం జరగుతుంది. ఈపదవికి అధిష్టానం ముగ్గురి నేతల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, ఎమ్మెల్సీ రామచంద్రరావు, నిజామాబాద్ ఎంపీ అరవింద్‌లలో ఎవరో ఒకర్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమిస్తారని సమాచారం అందుతోంది. అయితే మురళీధర్ రావు, రామచంద్రరావు ఇద్దరూ అగ్రవర్ణాలకు చెందినవారు కావడంతో అరవింద్‌నే ఆ పదవికి ఎంపిక చేస్తారని తెలుస్తోంది. అయితే అరవింద్ రాజకీయాలకు పూర్తిగా కొత్త కావడంతో అంతటి పెద్ద పదవిని ఆయనకు ఇస్తారా..? అని కూడా ఓ వర్గం చర్చిస్తున్నట్లు తెలిసింది.

- Advertisement -