మిస్సింగ్‌.. అసత్య ప్రచారం చేసిన వారికి పోలీసుల షాక్‌..

94
Cyber Crime police

తెలంగాణలో మిస్సింగ్‌ల వ్యవహారంలో ప్రచారాలు చేస్తున్న వారికి పోలీసులు షాక్ ఇచ్చారు. సోషల్ మీడియాలో మిస్సింగ్‌లపై అసత్య ప్రచారం చేస్తున్న ముగ్గురు ని అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. వెంకట్ , బాలరాజు , క్రాంతి కిరణ్ లను ఈ అసత్య ప్రచారం చేస్తున్నట్లు గుర్తించారు. వారిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు విచారిస్తున్నారు. అలాగే దీనికి కారణమైన తెలంగాణ యువ సైన్యం పేస్ బుక్ పేజీ అడ్మిన్‌పై కూడా కేసు నమోదు చేశారు.

రాష్ట్రంలో అమ్మాయిలు, మహిళలు, పిల్లలు, పెద్దలు పెద్ద సంఖ్యలో అపహరణకు గురవుతున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజంలేదని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళలు, అమ్మాయిలు తప్పిపోతున్నారంటూ జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ప్రజల్లో భయాందోళనలను సృష్టించే విధంగా సోషల్ మీడియా ద్వారా పుకార్లను వ్యాపింపజేయొద్దని డీజీపీ కోరారు. అలా ఎవరైనా చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.