లాక్‌డౌన్‌ నుంచి ఈ సంస్థలకు మినహాయింపు..

418
lookdown
- Advertisement -

ఇండియాలో కరోనా వైరస్‌ విజృంభణతో వాణిజ్య, ఉత్పాదక​ కార్యకలాపాలు స్తంభించాయి. పలు కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని కోరుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు సూచించింది. ఈ నియంత్రణలను పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించినట్లు కేంద్ర సమాచార శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఇందులో కొన్ని సంస్థలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది.

లాక్‌డౌన్‌ నుంచి మినహాయించిన సంస్థలు ఇవే..

డైపర్స్‌, శానిటరీ నాప్కిన్స్‌,
ఆక్సిజన్‌, డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌,
కోల్డ్‌ స్టోరేజ్స్‌,
వ్యవసాయాధారిత (చిల్లీ, టర్మరిక్‌, ఉప్పు, ైస్పెసెస్‌) పరిశ్రమలు,
బేకరీ ఉత్పత్తులు, మిఠాయిలు,
ఐస్‌ ప్లాంట్లు,
ఫిష్‌ ఫీడ్‌, పౌల్ట్రీ ఫీడ్‌, పశుగ్రాసం,
పవర్‌ జనరేటర్స్‌, సోలార్‌ జనరేటర్స్‌,
చక్కెర పరిశ్రమ,
ఆయుర్వేద, హోమియోపతి ఔషధ తయారీ యూనిట్లు,
బ్లీచింగ్‌ పౌడర్‌,
ప్యాకేజింగ్‌ ఇండస్ట్రీస్‌,
ఎఫ్లూయెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్స్‌.
రైస్‌ మిల్లులు, ఆయిల్‌ మిల్లులు,
పప్పు మిల్లులు,
డెయిరీ ఉత్పత్తులు,
డిస్టిల్డ్‌ వాటర్‌ ప్లాంట్లు, ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ ప్లాంట్లు, ఆర్వో వాటర్‌ ప్లాంట్లు,
రోలర్‌ ఫ్లోర్‌మిల్స్‌,
ఆహార (వెర్మిసెల్లీ, బిస్కెట్స్‌, ఫ్రూట్‌జ్యూస్‌, పల్ప్‌) పరిశ్రమలు
బల్క్‌డ్రగ్స్‌,
వైద్య సామగ్రి (సక్షన్‌ పైపులు, ఆక్సిజన్‌ పైపులు, పీపీఈ గేర్‌ సర్జికల్‌ ఎక్విప్‌మెంట్స్‌, బ్యాండేజ్డ్‌ క్లాత్‌) తయారీ పరిశ్రమలు,
ఫార్మాస్యూటికల్స్‌ ఫార్మలేషన్స్‌, ఆర్‌అండ్‌డీ,
లిక్విడ్‌ సబ్బులు, డిటర్జెంట్‌ సబ్బులు, ఫినాయిల్‌, ఫ్లోర్‌ క్లీనర్స్‌,
శానిటైజర్స్‌,
మాస్కులు, బాడీ సూట్లు,
పేపర్‌ నాప్కిన్స్‌,

- Advertisement -