శ్రీవిష్ణు…..తిప్పరా మీసం టీజర్‌

748
tippara meesam
- Advertisement -

వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో శ్రీవిష్ణు. బ్రోచేవారెవరురా మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ హీరో తాజాగా తిప్పరా మీసం అంటూ ప్రేక్షకుల ముందుకురానున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ లుక్‌తో ఆకట్టుకున్న శ్రీవిష్ణు…తాజాగా టీజర్‌తో పలకరించనున్నాడు. సెప్టెంబర్ 5 రాత్రి 8 గంటల 10 నిమిషాలకు టీజర్‌ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. ఈ మేరకు ఓ పోస్టర్‌ని విడుదల చేసింది.

శ్రీవిష్ణు లుక్ చాలా కొత్తగా ఉంది. కలర్ అద్దాలతో అదిరిపోయే లుక్‌తో ఆకట్టుకున్నాడు శ్రీ విష్ణు. అసుర సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కృష్ణ విజయ్ ఎల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

యాక్షన్ డ్రామాగా తిప్పరా మీసం తెరకెక్కుతోంది. నిక్కి తంబోలీ, రోహిణి ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అచ్యుత్ రామారావు, బెనర్జీ, రవిప్రకాష్, రవి వర్మ, నవీన్ నేని, ప్రవీణ్, నేహా దేశ్ పాండే తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. సిధ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

- Advertisement -