ఏపీ కేబినెట్‌..ఐదుగురు డిప్యూటీ సీఎంలు వీరే?

384
jagan
- Advertisement -

ఏపీ సీఎం జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దేశ చరిత్రలో ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి చేయనివిధంగా కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ మంత్రులుగా ఉంటారని వెల్లడించి సంచలనం సృష్టించారు జగన్‌.డిప్యూటీ సీఎంలుగా కాపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందినవారికి అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించారు.

దీంతో జగన్ టీంలో ఉండబోయే డిప్యూటీ సీఎంలపై చర్చ జోరుగా సాగుతోంది.వైసీపీ నేతల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కాపు సామాజిక వర్గం నుంచి ఆళ్ల నాని, మైనారిటీ కోటాలో అంజాద్ బాషా, ఎస్సీ సామాజిక వర్గం నుంచి మేకతోటి సుచరిత, ఎస్టీ కోటాలో రాజన్న దొర, బీసీల నుంచి పార్థసారధిలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కుతాయని సమాచారం. సాయంత్రం మంత్రివర్గంలో చోటు దక్కించుకునేవారి జాబితాను విడుదల చేయనున్నారు సీఎం జగన్‌.

మరోవైపు క్యాబినెట్‌లో ఎవరికి స్థానం దక్కుతుందోనని ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతానికిపైగా మంత్రి పదవులు ఇస్తామని జగన్‌ ప్రకటించడంతో రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -