హుజుర్‌నగర్‌ సభ…హైలైట్స్

612
huzurnagar
- Advertisement -

హుజుర్‌నగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు సీఎం కేసీఆర్. హుజుర్‌నగర్‌లో ప్రజా కృతజ్ఞత సభకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం ప్రజలు ఇచ్చిన తీర్పుతో మరింత అంకిత భావంతో పని చేస్తామని చెప్పారు. ప్రజలు బల్ల గుద్ది తీర్పు చెప్పారు….. అభివృద్ధి కి పట్టం కట్టారన్నారు.

హుజుర్‌నగర్‌ నియోజకవర్గంలో 134 గ్రామ పంచాయతీ లాలకు ఒక్కో పంచాయితీ కి 20 లక్షల చొప్పున ప్రత్యేక నిధులు మంజూరు చేస్తానని ప్రకటించారు సీఎం.7 మండల కేంద్రల్లో ఒక్కో మండల అభివృద్ధి 30 లక్షల చొప్పున విడుదల చేస్తానని తెలిపిన సీఎం….హుజుర్‌నగర్‌ మున్సిపాలిటీకి సీఎం ఫండ్ నుంచి 25 కోట్లు ,నెరేడుచర్ల మున్సిపాలిటీ అభివృద్ధి కి 15 కోట్లు విడుదల చేస్తానని చెప్పారు.

హుజుర్‌నగర్‌ నియోజకవర్గంలో గిరిజన రెసిడెన్షియల్ పాఠశాల ,బంజారా భవన్,పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. హుజుర్‌నగర్‌ రెవెన్యూ డివిజన్ , ESI ఆసుపత్రి, కోర్టును ఏర్పాటు చేస్తాం అన్నారు. నియోజకవర్గంలో దండిగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేస్తానని తెలిపారు.

1997 లో ఎన్టీ రామారావు సీఎం గా ఉన్నపుడు నల్లగొండ జిల్లా ఇంచార్జి మంత్రి గా ఉన్నపుడు సూర్యాపేట లో పర్యటన చేసిన………. అప్పుడు ఉన్న సమస్యలే ఇప్పుడు కూడా ఉన్నాయని చెప్పారు. మంత్రి జగదీష్ రెడ్డి 300 కిలోమీటర్ల నుంచి కాళేశ్వర ప్రాజెక్ట్ జలాలను తెచ్చి సూర్యాపేట నియోజకవర్గనికి నీళ్లు ఇచ్చిండన్నారు. సాగర్ ప్రాజెక్ట్ కింద నల్గొండ జిల్లాలో పూర్తి స్థాయిలో సాగు నీరు ఇప్పటికి అందడం లేదన్నారు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగు నీరు అందించే యజ్ఞం చేస్తున్నానని చెప్పారు. గోదావరి లిఫ్ట్ జలాలు కృష్ణా నదిలో కలిపి అందరికి సాగు నీళ్లు అందిస్తాం అన్నారు.

కోదాడ నుంచి సాగర్ వరకు పర్యటన చేసి సాగర్ ఆయకట్టు రైతులకు బాధలు లేకుండ చేస్తాను…. అవసరమైన లిఫ్ట్ లను మంజూరు చేస్తాం……….లింగగిరి కాల్వ ను అభివృద్ధి చేస్తాం అన్నారు. సాగర్ ఎడమ కాలువ కింద ఉన్న లిఫ్ట్ లాల్లో ఉన్న సిబ్బందిని ప్రభుత్వం లో కలుపుకుంటాం………..లిఫ్ట్ లను ప్రభుత్వమే మెంటేన్ చేస్తాం అన్నారు.

సైదిరెడ్డి పై అసత్య ఆరోపణలు చేసిన ప్రతిపక్షాలకు హుజుర్‌నగర్‌ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టిన్రు………….ఎన్నో బాధలు పడి ,పోరాడి తెలంగాణ సాధించినం.. ఎన్నో అవమానాలు భరించాము అన్నారు. రైతులకు రైతు బంధు పథకం,బీమా అమలు చేస్తున్నాం….దేశానికే ఆదర్శంగా నిలిచాం అన్నారు.మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేద్దాం,కేసీఆర్ గో హెడ్ అని చెప్పి హుజుర్‌నగర్‌ ప్రజలు ప్రోత్సహించారన్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కు కంచు కోట అని కాంగ్రెస్ నేతలు భ్రమలు పడ్డారు.. కానీ అవి మంచు కొండల్లా కరిగిపోయాయని చెప్పారు మంత్రి జగదీష్ రెడ్డి.అభివృద్ధి అంటే ఎంటో చేసి చూపాము…. అందుకే ప్రజలు టీఆర్ఎస్‌ కు బ్రహ్మరథం పట్టారు…….యాదాద్రి పవర్ ప్లాంట్ ను, యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మిస్తున్న సీఎం కేసీఆర్ కు ప్రజలంతా ఎప్పటికి రుణపడి ఉంటారని చెప్పారు.

హుజుర్‌నగర్‌ ప్రజలు చరిత్ర సృష్టించారని చెప్పారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. అఖండ విజయాన్ని అందించారు……కాంగ్రెస్ ను మట్టి కరిపించారు…..హుజుర్‌నగర్‌ అభివృద్ధి కోసం వచ్చిన ఈ ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో తీర్పు ఇచ్చారని చెప్పారు. ఇక హుజుర్‌నగర్‌ అభివృద్ధిని ఎవ్వరు అడ్డుకోలేరన్నారు.

తనను ఎమ్మెల్యేని చేసిన హుజుర్‌నగర్‌ ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు సైదిరెడ్డి. చెప్పిన అన్ని హామీలను మాట తప్పకుండా నెరవేరుస్తాను……..సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రోత్సహం తో హుజుర్‌నగర్‌ ను అభివృద్ధి కి ముఖద్వారంగా మారుస్తానని చెప్పారు.

- Advertisement -