హిట్ మ్యాన్‌ తల్లిదండ్రులెవరో తెలుసా…?

467
rohith
- Advertisement -

హిట్ మ్యాన్‌గా భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రోహిత్ శర్మ. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో తిరుగులేని బ్యాటింగ్ ప్రదర్శనతో భారత్‌ను సెమీస్‌కు చేర్చిన రోహిత్….ఐదు సెంచరీలు చేసి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు.

ఒక ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించిన రోహిత్‌ శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర రికార్డును రోహిత్ శర్మ బద్దలుగొట్టాడు. 2015 ప్రపంచకప్‌‌లో కుమార సంగక్కర నాలుగు సెంచరీలు సాధించగా ప్రస్తుతం రోహిత్ కన్ను సచిన్ టెండూల్కర్‌ 16 ఏళ్ల రికార్డుపై పడింది. 2003 వరల్డ్‌కప్‌లో సచిన్ టెండూల్కర్ 673 పరుగులు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ(647)లతో అగ్రస్ధానంలో ఉన్నారు. మరో 27 పరుగులు చేస్తే సచిన్ రికార్డును సైతం తిరగరాయనున్నాడు.

ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఇప్పటివరకు రోహిత్ చేసిన పరుగులు,డబుల్ సెంచరీలు,ఎన్ని రికార్డులు బ్రేక్ చేశాడనే దానితో పాటు అసలు రోహిత్ శర్మ హిస్టరీ గురించి సెర్చ్ చేస్తున్నారు.

Enter

ఈ క్రమంలో రోహిత్ శర్మ తల్లి పూర్ణిమ శర్మ తెలుగింటి ఆడపడుచు అని తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. రోహిత్ తల్లి స్వస్థలం విశాఖపట్నం. తండ్రి గురునాథ్ శర్మ ఓ రవాణ సంస్థలో స్టోర్ హౌస్ కేర్ టేకర్‌గా పనిచేసేవారు. ఆర్థికంగా దిగువ మధ్యతరగతి కుటుంబం కావడంతో తాత,మావయ్యల దగ్గర పెరిగి పెద్దవాడయ్యాడు.

స్కూల్‌లో కోచ్ కల్పించిన స్కాలర్ షిప్ తో చదువు కొనసాగిస్తూ , క్రికెట్ లోని ఓనమాలు నేర్చుకున్నాడు రోహిత్.కష్ట నష్టాలను ఒర్చుకుని , ఇప్పుడు భారతదేశం గర్వించే స్థాయికి , క్రికెట్ ప్రపంచం తనవైపుకు చూసే స్థాయికి ఎదిగాడు.

- Advertisement -