హీరో విజ‌య్ ‘విజిల్‌’ ఫ‌స్ట్ లుక్..

290
- Advertisement -

తమిళ హీరో విజ‌య్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. గతంలో వచ్చిన మెర్సల్‌,తెరీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. ప్ర‌స్తుతం విజయ్‌.. అట్లీ దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో `బిగిల్‌`( విజిల్ అనే అర్థం) అనే సినిమా చేస్తున్నాడు.

ఈ మూవీలో న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తోంది. అలాగే ఇందులో బాలీవుడ్ న‌టుడు జాకీ ష్రాఫ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ రోజు విజ‌య్ బ‌ర్త్‌డే( జూన్ 22) సంద‌ర్భంగా ఈ చిత్ర టైటిల్‌తో పాటు లుక్స్‌ రిలీజ్‌ చేశారు చిత్ర బృందం.

Thalapathy Vijay

ఈ చిత్రంలో విజ‌య్ రెండు లుక్స్‌లో క‌నిపించ‌నున్నారు. అందులో ఒక‌టి గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర అయితే.. మ‌రొక‌టి ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ పాత్ర అని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో కథిర్, యోగిబాబు, రెబా మోనికా జాన్, వివేక్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దీపావ‌ళికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

- Advertisement -