నవంబర్‌లో తెనాలి రామకృష్ణ BA BL

439
sandeep kishan
- Advertisement -

సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న తెనాలి రామకృష్ణ BA BL షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. జి నాగేశ్వర రెడ్డి ఈ చిత్రాన్ని ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. హన్సిక ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.

తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. మురళీ శర్మ, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెనాలి రామకృష్ణ BA BL పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వేగంగా జరుగుతున్నాయి. సాయి కార్తిక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ మధ్యే విడుదలైన ఫస్ట్ లుక్‌ మరియు టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెనాలి రామకృష్ణ BA BL విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్.

నటీనటులు: సందీప్ కిషన్, హన్సిక, మురళీ శర్మ, వరలక్ష్మీ శరత్ కుమార్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, ప్రభాస్ శ్రీను, పృథ్వీ, రఘు బాబు, సప్తగిరి, రజిత, కిన్నెర, అన్నపూర్ణమ్మ, వై విజయ, సత్య కృష్ణ..

- Advertisement -