గద్దెపైకి చేరిన సారలమ్మ

395
Telangana’s Medaram Jathara begins
- Advertisement -

మేడారం జాతర సంబరాల అంబరాన్నంటాయి. మహాజాతరలో తొలిఘట్టం ఆవిష్కృతమైంది. సారలమ్మ రాకతో మేడారం జనసంద్రంగా మారింది. కన్నెపల్లి నుంచి డప్పు వాయిధ్యాల మధ్య గిరిజన సంప్రదాయ రీతిలో సారలమ్మను మేడారానికి తీసుకొచ్చారు పూజారులు.ఆదివాసీ సంప్రదాయ నృత్యాల నడుమ పగిడిద్దరాజు, గోవిందరాజుతో కలిసి సారలమ్మ మేడారంలోని సమ్మక్క ఆలయానికి తీసుకువచ్చారు. సారలమ్మ రాకకోసం భక్తులు చలిని లెక్కచేయకుండా అమ్మవారిని దర్శించుకున్నారు. గద్దెల వద్ద బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

ఇవాళ సమ్మక్కను మేడారం సమీపంలోని చిలుకల గుట్ట నుంచి గద్దెపైకి అధికారిక లాంఛనాలతో తీసుకురానున్నారు. సాయంత్రం ఈ కార్యక్రమం మొదలై రాత్రి వరకు కొనసాగుతుంది. సమ్మక్కను తీసుకొచ్చే ముందు పోలీసులు గాల్లోకి కాల్పులు జరుపుతారు. తర్వాత తల్లిని గద్దె పైకి తీసుకొచ్చి ప్రతిష్టిస్తారు. శుక్ర, శనివారాల్లో జాతర కొనసాగుతుంది. శనివారం రాత్రి గిరిజన దేవతలు వన ప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది.

medaram-jatara

ఇవాళ ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ మేడారం జాతరకు రానున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, కేంద్ర కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి ఓరం రేపు జాతరకు వస్తున్న నేపథ్యంలో గద్దెల ప్రాంగణం సమీపంలో తాత్కాలిక హెలిప్యాడ్‌లు నిర్మిస్తున్నారు. సీఎం కేసీఆర్ రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరుతారు. మధ్యాహ్నం 1.15 గంటలకు మేడారం చేరుకొని, 1.25 గంటలకు గద్దెల ప్రాంగణానికి వస్తారు. తల్లులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.

- Advertisement -