విద్యుత్ పొదుపు చేయండి: జానయ్య

484
md janaiah
- Advertisement -

హైదరాబాద్ ఖైరతాబాద్ లోని విశ్వేశ్వరయ భవన్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ ఆధ్వర్యంలో జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాంకేతిక విద్య శాఖ కమిషనర్ నివిన్ మిట్టల్ ,టీఎస్ ఈఆర్సీ చైర్మన్ శ్రీ రంగరావు,టీఎస్ రెడ్కో ఎండి జానయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన రెడ్కో ఎండీ జానయ్య…. ప్రతి సంవత్సరం విద్యుత్ పొదుపు వారోత్సవాలు జరుకుంటున్నాం అన్నారు. విద్యుత్ పొదుపు కి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని..విద్యుత్ పొదుపు చేసే మనం ఇంట్లో వాడే ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి వాటిని మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. విద్యుత్ పొదుపు చేసే సంస్థలకు అవార్డ్స్ ప్రధానం చేస్తున్నాం…గవర్నర్ చేతుల మీదుగా వారికి అవార్డ్స్ అందిస్తున్నామని చెప్పారు.

విద్యుత్ పొదుపు పై అవగాహన కల్పించాలన్నారు టీఎస్ ఈఆర్సీ చైర్మన్ శ్రీ రంగారావు. విద్యుత్ పొదుపు చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని..ఇంట్లో వాడే విద్యుత్ పరికరాలు విద్యుత్ పొదుపు చేసేవి వాడాలని సూచించారు. గృహాల్లో ,వ్యాపార సముదాయంలో విద్యుత్ పొదుపు చేసే విద్యుత్ పరికరాలు ఉపయోగించాలని..
విద్యుత్ పొదుపు వలన పర్యావరణ పరిరక్షణ కూడా సాధ్యం అవుతుందన్నారు.

ప్రతిదీ విద్యుత్ పైనే ఆధారపడి ఉంటుందని సాంకేతిక విద్య శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ చెప్పారు. సోలార్ విద్యుత్ వాడకం కూడా పెరుగుతుంది ఇది మంచి పరిణామం. సోలార్ విద్యుత్ కు ఖర్చు చాలా తక్కువ అన్నారు. విద్యుత్ ను ఎంత పొదుపు చేస్తే అంత మంచిది..విద్యుత్ పొదుపు పై అవగహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అన్ని మున్సిపాలిటీ లలో స్ట్రీట్ లైట్స్ ఇప్పటికే ఎల్ ఈడి లైట్స్ వాడుతున్నారు..కాలేజ్,ఇన్స్టిట్యూట్ లలో సోలార్ విద్యుత్ వాడుతున్నాం అన్నారు. అన్ని డిగ్రీ కళాశాలలో, టెక్నీకల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో విద్యుత్ పొదుపు వారోత్సవాలు జరువుతాం… విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు.

Telangana State Renewable Energy MS Janaiah speech… Telangana State Renewable Energy MS Janaiah speech… Telangana State Renewable Energy MS Janaiah speech

- Advertisement -