తెలంగాణ ఆవిర్భావం..చరిత్ర

619
kcr
- Advertisement -

నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిన రోజు ఇది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేతృత్వాన జరిగిన ఉద్యమానికి ఫలితం అందిన రోజు. జూన్ 2 తెలంగాణ ప్రజలు మర్చిపోలేని రోజు. దశాబ్దాల ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ భారతదేశ చరిత్రలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. నాలుగేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ఘనత,అభివృద్ధి,మున్ముందు ఏం చేయాబోతున్నామన్న వివరాలను కనిపించేలా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది.

1969-70లలో వచ్చిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని కొన్ని చట్టపర, రాజకీయ చర్యల ద్వారా నిరోధించగలిగినప్ప టికీ.. తమకు జరుగుతున్న అన్యాయాలపై తెలంగాణలోని వివిధ వర్గాల ప్రజలలో అసంతృప్తి రగులుతూనే ఉంది.1985 నుంచి అనేక సంస్థలు, వేదికలు, వ్యక్తులు తెలంగాణ వెనుకబాటు, అభివృద్ధిపై చర్చలు జరుపుతూనే ఉన్నారు.

cm kcr

1991లో తెలంగాణ స్టూడెంట్స్‌ ఫ్రంట్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అనేక ఆందోళనలు చేపట్టింది. 1990లో తెలంగాణ ప్రజాసమితి ఆధ్వర్యంలోని వరంగల్‌ సదస్సులో తెలంగాణ మహాసభ, త

- Advertisement -