ప్రభుత్వం ఆదేశిస్తే మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం- నాగిరెడ్డి

37

ఎన్నికల సంఘం కార్యాలయంలో నేడు జరిగిన సమావేశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిన్నటితో మూడు విడతల పరిషత్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ పరిషత్‌ ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయి. ఎక్కడ కూడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు,అల్లర్ల జరగలేదు. దాంతో ఎక్కడా రిపోల్ రాలేదు. కొన్ని చోట్ల సాంకేతిక ఇబ్బంది వల్ల మూడు ఎంపిటిసి లకు రిపోల్ వచ్చింది. అన్నారు. ఈ సారి పోలింగ్ శాతం కూడా బాగా ఉంది 77 శాతం పైగా పోలింగ్ శాతం నమోదు అయింది. ఇక ఓటింగ్ ప్రక్రియ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాం. సర్పంచ్ ఎన్నికలలో జరిగిన తప్పులను చూసుకొని పరిషత్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నాం.

ఎన్నికల సిబ్బంది, పోలీస్ శాఖ, అభ్యర్థులు, ఓటర్లకు అందరికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా బ్యాలెట్ పేపర్ బయటకు వచ్చిన నేపథ్యంలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. బ్యాలెట్ పేపర్‌ల ముద్రణకు సమయం తక్కువ ఉండడంతో కొంత తప్పిదాలు జరిగాయి. కానీ పెద్దగా ఏమీ కాలేదు. ప్రింటింగ్ ప్రెస్‌లో కొంత తప్పిదాలు జరిగాయి.లు చెక్ చేసుకోవాలి 7 చోట్ల బ్యాలెట్ పేపర్‌లలో తప్పిదాలు గుర్తించాం. ఇక్కడ పోలింగ్ కేంద్రాల అభ్యర్థులు ,ఏజెంట్‌లు గుర్తించారు అంతేకాదు పోలింగ్ సిబ్బంది తప్పిదం కూడా జరిగింది.

Telangana State Election Commissioner

ఓట్ల లెక్కింపు 27న జరిగుతుంది. 3 చోట్ల కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాము. స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర భద్రతా బలగాలు ఏర్పాటు చేశాం. మూడు దశలలో కౌంటింగ్ జరుగుతుంది. మొదటి దశలో బ్యాలెట్ పేపర్ లను లెక్కిస్తారు ఇది పోలింగ్ కేంద్రాల వారిగా జరుగుతుంది. తరువాత వీటిని బండిల్ చేస్తారు, ఆ తరువాత ఎంపీటీసీ, జెడ్పిటిసి వారిగా లెక్కిస్తారు. రెండో దశలో ఎంపిటిసి ఎన్నికకు కౌంటింగ్ మొదలు పెడతారు. ఒక్కో ఎంపీటీసీకి ఇద్దరు ఏజెంట్ లను ఏర్పాటు చేసుకోమని చెప్పాము.  ప్రతి బ్యాలెట్ పేపర్ ఓపెన్ చేసి వ్యాలీడా.. కాదా అనేది ఏజెంట్‌లు ముందు చూస్తారు. అనంతరం రిటర్నింగ్ అధికారుల దగ్గరకు పంపిస్తారు. ఈ ఎన్నికల్లో ఎక్కడ కూడా బలవంతపు ఏకగ్రీవాలు జరుగలేదు జరిగినట్లు మాకు ఫిర్యాదు అందలేదు.

నాగర్ కర్నూల్ జిల్లాలో 10 లక్షలు పంచుతూ దొరకడం చిన్న విషయం కాదు ఒక్క ఎంపీటీసీకి ఇంత డబ్బుతో దొరకడం మంచిది కాదు అందుకే ఎన్నిక వాయిదా వేశాం. డబ్బులు పంచుతూ దొరికిన వ్యక్తి పై క్రిమినల్ కేస్ లు బుక్ చేసి నేరం రుజువైతే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆదేశాలు జారీ చేస్తాం.  కాలపరిమితి ముగియకముందే ఎన్నికలు జరపాలి అని అన్నారు. ఇప్పుడు ఉన్న ఎంపిటిసి, జెడ్పిటిసి లు జులై 3 వరకు పదవీ కాలం ఉంది. కొత్తగా ఎన్నికైన జెడ్పిటిసి లు 4th జులై నుండి అధికారంలోకి వస్తారు. జులై 5 తరువాత జెడ్పి చైర్మన్ ఎన్నిక ఉంటుంది. ఆగస్టు లో 5 ఖమ్మం జెడ్పి చైర్మన్ పదవి కాల పరిమితి ముగుస్తుంది. ప్రభుత్వం ఆదేశిస్తే మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం. పోలింగ్ శాతం బాగా ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలిస్తే పరిషత్ ఎన్నికలకు తగ్గింది అని అన్నారు.