ఎమ్మెల్యేల నూతన వసతి గృహాలను పరిశీలించిన స్పీకర్, మంత్రి ప్రశాంత్ రెడ్డి

321
mlas New Residence
- Advertisement -

హైదర్ గూడలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస గృహాలను సోమవారం సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈసందర్భంగా అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు R&B, గృహ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి. అనంతరం సీఎం కేసీఆర్ రాక సందర్భంగా అక్కడి అధికారులతో సమావేశం నిర్వహించారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.

Mlas New Residence 2

ఈ నివాస గృహాలను స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. 17న ఉదయం 6 గంటలకు కొత్త నివాసాలకు కేసీఆర్‌ గృహవాస్తు పూజలు చేయనున్నారు.మొత్తం 4.5 ఎకరాల్లో రూ. 166 కోట్లతో 12 అంతస్తులతో 120 క్వార్టర్లను నిర్మించారు.

2100 చదరపు అడుగుల ప్రతి క్వార్టర్‌లో 3 బెడ్‌రూమ్‌లను ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఎమ్మెల్యేల వ్యక్తిగత సిబ్బంది, 36 మంది సిబ్బందికి కూడా గదులను కేటాయించనున్నారు. ఈ ప్రాంగణంలోనే బ్యాంకు, క్లబ్‌ హౌజ్‌, సూపర్‌ మార్కెట్‌ నిర్మించారు. 240 వాహనాల పార్కింగ్‌కు సదుపాయం కల్పించారు.

- Advertisement -