నేటినుంచి పాఠశాలలు పున:ప్రారంభం.. కొత్త నిబంధనలు ఇవే

383
Schools
- Advertisement -

తెలంగాణలో నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. వేసవి సెలవుల అనంతరం ఇవాల్టీ నుంచి స్కూల్ లను తెరవనున్నారు పాఠశాల యాజమాన్యాలు. ఇతకాలం సమ్మర్ హాలిడేస్‌లో ఆటపాటలతో గడిపిన విద్యార్థులు స్కూల్ డ్రెస్సులు ధరించి, బ్యాగులు వేసుకొని మళ్లీ బడి బాట పట్టారు. తొలుత జూన్‌ 1న తిరిగి బడిగంట మోగుతుందని ప్రభుత్వం ముందుగా ప్రకటించినా ఎండల తీవ్రత దృష్ట్యా జూన్‌ 11 వరకు సెలవులను పొడిగించింది. ఉన్నత పాఠశాలలు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:45 వరకు, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4:15 వరకు కొనసాగుతాయి. ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయి.

ఇక తెలంగాణలో ఈ విద్యా సంవత్సరంలో…. 2020 ఏప్రిల్‌ 23వ తేదీని చివరి పనిదినంగా నిర్ణయించారు. ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11 వరకు వేసవి సెలవులు. ఈ ఏడాది దసరా సెలవులను సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 13 వరకు ప్రకటించారు. క్రిస్మస్‌ సెలవులు డిసెంబరు 12 నుంచి 28 వరకు ఉంటాయి. 2020 జనవరి 11-16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు. పదో తరగతి విద్యార్థులకు సిలబ్‌సను 2020 జనవరి 10 వరకు పూర్తి చేయాలని నిర్దేశించింది. 1 నుంచి 9 తరగతుల సిలబ్‌సను ఫిబ్రవరి 29 వరకు పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొంది.

- Advertisement -