ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ మరో బంపర్ ఆఫర్   

437
cm KCr Rtc Employes
- Advertisement -

ఆర్టీసీ కార్మికులకు మరో గుడ్ న్యూస్ తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. ఆర్టీసీలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తం 296 మంది డ్రైవర్లు, 63 మంది కండక్టర్లను రెగ్యూలరైజ్ చేశారు. గతంలో ఈ ఉద్యోగులు గతంలో జరిగిన సమ్మెల సమయంలో 240 రోజులపాటు తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేశారు. మొత్తం 359 మందిని ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయడంతో ఉద్యోగులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కాగా 52రోజుల సమ్మె అనంతరం ఆర్టీసీ కార్మికుల పట్ల సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. ఇచ్చిన హామిల ప్రకారం ఒక్కొక్కటి నెరవేర్చుకుంటు వస్తున్నారు. మొదటగా సెప్టెంబర్ నెల జీతాలు ఇచ్చారు.. ఆ తర్వాత సమ్మె చేసిన రెండునెలల జీతాలు కూడా ఇస్తామని ప్రకటించారు సీఎం. తాజాగా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల రెగ్యులరైజైన ఉద్యోగులు ఆర్టీసీ యాజమాన్యానికి, సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు సీఎంకు రుణపడి ఉంటామని తెలిపారు.

- Advertisement -