రెసిడెన్షియల్ స్కూళ్లలో అడ్మిషన్లు ప్రారంభం..

489
telangana residential schools
- Advertisement -

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్క (119) కొత్త బిసి రెసిడెన్షియల్ స్కూల్ లో అడ్మిషన్ల పక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది ప్రభుత్వం.

ఈ సంవత్సరం 5వ తరగతి నుండి 7వ తరగతి వరకు అడ్మిషన్ల పక్రియ ప్రారంభం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.2019-2020 విద్య సంవత్సరం కు గాను 5వ తరగతి నుండి 7 వ తరగతి వరకు ఆయా ప్రాంతాల్లో పాఠశాల భవనాలను గుర్తించాలని కలెక్టర్ ,బిసి వెలిఫెర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అధికారులు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పడకముందు కేవలం 19 స్కూల్స్ మాత్రమే ఉండేవి. తెలంగాణ వచ్చిన తరువాత 2016 -17 సంవత్సరంలో 19 జూనియర్ కాలేజీలు, 1 మహిళల డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశారు. 2017-18 సంవత్సరంలో సీఎం కేసీఆర్ కృషిలొ 119 పాఠశాలలు ,2019-20 సంవత్సరంలో కూడా 119 పాఠశాలలు ప్రారంభించారు. మొత్తం 281 కాలేజీలు మరియు పాఠశాలలో ప్ర‌స్తుతం 92 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.

కొత్త స్కూల్స్ కొరకు 3689 పోస్టులు మంజూరు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ పోస్టులను వివిధ దశలలో 2019 -20 నుండి 2022- 23 వరకు భ‌ర్తీ చేయనున్నారు.

- Advertisement -