అవినీతికి ఆస్కారం లేని…సమగ్ర పట్టణాభివృద్ధి

218
telangana new muncipal act

సమగ్రమైన పట్టణాభివృద్ధి,అవినీతికి ఆస్కారం లేకుండా కొత్త మున్సిపల్ చట్టాన్ని రూపొందించింది ప్రభుత్వం. మున్సిపాలిటీల ఏర్పాటు, ఆదాయం, మంచినీటి సరఫరా విధులు, టౌన్‌ప్లానింగ్, రాష్ట్ర ఎన్నికల కమిషన్, ఎన్నికల నిర్వహణ, ఇతర అనుబంధ చట్టాలు, నిబంధనలను ఈ చట్టంలో పొందుపర్చింది ప్రభుత్వం. గ్రేటర్‌ హైదరాబాద్ మినహా మిగితా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఈ చట్టం వర్తించనుంది.

()కొత్త చట్టం లో మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్లకు ప్రత్యేకంగా విధులు, బాధ్యతలను పొందుపరిచారు.
()వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రతి మున్సిపాలిటీలో యువత, మహిళలు, పెద్దలు, నిపుణులతో కలిసి 15 మంది సభ్యుల కమిటీలను ప్రత్యేకంగా ఏర్పాటుచేస్తారు.
()ప్రతి మున్సిపాలిటీలోని ప్రభుత్వ స్థలాల్లో మూత్రశాలలు, విశ్రాంతిశాలలు ఏర్పాటుచేయాలి. వీటిని రెస్టారెంట్లు, హోటళ్లు, షాపింగ్ మాళ్లు, సినిమా థియేటర్లు, విద్యాసంస్థలు వంటి నివాసేతర భవనాల్లో సాధారణ ప్రజానీకానికి అక్కరకొచ్చేలా ఏర్పాటుచేయాలి. ప్రజారహదారుల మీద తలుపు కానీ గేటు కానీ ఏర్పాటు చేయకూడదు. ఎవరైనా రహదారులు, కాలిబాటలను ధ్వంసం చేస్తే చర్యలు తీసుకుంటారు.
()పాదచారులు, బస్టాప్‌ల కోసం మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తారు.
()వీధిదీపాల నిర్వహణ కట్టుదిట్టంగా జరుగుతుంది.
()ప్రజలకు ఉపయోగపడేలా పబ్లిక్ మార్కెట్ల ఏర్పాటు
()వేలం పాటల ద్వారా మున్సిపల్ షాపుల కేటాయింపు
()-అన్ని సదుపాయాలుండేలా వైకుంఠధామాలు
()నిర్ధారిత ప్రాంతంలోనే కబేళాను ఏర్పాటు
()అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా పటిష్ఠమైన చర్యలు
()నగరాలు, పట్టణాల్లో నిబంధనల మేరకు ఇల్లు కట్టుకొనేవారికి నిబంధనలు సరళతరం
()75 చదరపు మీటర్లలోపు జీ+1 అంతస్తు ఎత్తులో ఇల్లు కట్టుకోవాలంటే స్థానికసంస్థల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోనక్కర్లేదు.
()180 గజాల ప్లాటును రెండుగా విడగొట్టి ఇల్లు కట్టుకుందామనుకొంటే.. ఇంటి విలువలో దాదాపు 25శాతం జరిమానా విధిస్తారు.
()75 చదరపు మీటర్ల నుంచి 500 చదరపు మీటర్ల స్థలం, 10 మీటర్ల ఎత్తులోపు ఇల్లు కట్టుకోవాలనుకొనేవారు ఆన్‌లైన్‌లో స్వీయ ధ్రువీకరణ పత్రం అందజేస్తే వెంటనే అనుమతి లభిస్తుంది. వీరంతా ఆస్తిపన్ను నిమిత్తం కేవలం రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.
()500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం, 10 మీటర్ల కంటే ఎత్తులో కట్టే నిర్మాణాలకు సింగిల్ విండో విధానంలో అనుమతినిస్తారు.
()సింగిల్ విండో విధానం ద్వారా ఆన్‌లైన్‌లో అనుమతి
()ఇంటింటి నుంచి చెత్త సేకరణ
()పచ్చదనం కోసం నిధులు వెచ్చించడం
() పార్కుల అభివృద్ధి, మంచినీటి సరస్సుల సంరక్షణ
(), ప్రభుత్వ స్థలాల్ని కాపాడటం, పురపాలక ఆస్తులపై దురాక్రమణల తొలగింపు
() మున్సిపల్ వ్యర్థాల నిర్వహణకు ఒక సంస్థను ఏర్పాటు
()ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించే కార్యకలాపాలకు విఘాతం కలగకుండా కోర్టులు ఇంజక్షన్ ఆర్డర్లు ఇవ్వకుండా పటిష్ట చట్టం